పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

137



1. ప్రేమకు వాసస్థలమై, నైర్మల్యమునకు నిలయమై, నిత్యము నమ్రజనులు పాపముల నంతముజేయు ఇంద్రాణీ మందహాసము నా యాపదలను తొలగించుగాక.


2. దయతోగూడిన చూపులచే పాతకములను హరించి, మంగళములనిచ్చి, యింద్రాణి నాజన్మదేశము నుజ్జ్వల మొనర్చుగాక.


3. ఓ యంబా ! ఆకాశమనియు, నమ్రమైన భ్రూలతలుగల దేవత యనియు నీ రూపములు రెండుగా చెప్పబడుచున్నది. మొదటిది వృషాకపిని (సూర్యుని) కనెను, రెండవది జయంతుని కనెను.


4. ఓ దేవీ ! పండితులీ వృషాకపిని లోకబాంధవుడనుచున్నారు. వర్షములకు హేతువగు కిరణములు గలవాడు గనుక 'వృషా' యనియు, కిరణములచే నుదకములను ద్రాగును గనుక 'కపి' యనియు నిరుక్తము.


5. ఓ యింద్రాణీ ! కొందఱు పండితులు వృషాకపి యనగా చంద్ర రేఖ శిరోభూషణముగా గలవాడని (శివుడని) చెప్పుదురు. మఱికొందఱు వృషాకపిని శేషశయ్యా శాయి (విష్ణువని) యను చున్నారు.


6. ఓ దేవీ ! మఱికొందఱు వృషాకపిని వైద్యు తాంశకు బుట్టి, మరుద్గణములకు ముఖ్యుడై, వేదమంత్రముల కధిపతియైన బ్రహ్మణస్పతియనియు, విశ్రుతిగాంచిన విఘ్నేశ్వరుడనియు చెప్పుదురు.