పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

హేమలత

అని మహారాష్ట్ర భాషనున్న యా యుత్తరమును బారసీక భాషలోనికి మార్చి చక్రవర్తికి విన్నవించి వసంతభట్టూరకుండెను. చక్రవర్తి కాగ్రహమును నాశ్చర్యమును నేకకాలమున జనించెను. ఉత్తర హిందూస్థానమందున్న గొప్ప రాజ్యమగు చిత్తూరును దక్షిణమున గొప్ప రాజ్యమగు దేవగిరియును గలిసిన చక్రవర్తి వారల గెలుచుట యసాధ్యము. అందుచే జక్రవర్తి భయపడి కర్తవ్యమూహించుచు నీ కీ కాగితములెట్లు లభించినవి అని ఖాను నడిగెను. ఖానేమో యబద్ధములఁ జెప్పుట కాలోచించుచుండెను.

ఈ యుత్తరమునుబట్టిచూడ నీవఱకు రాజపుత్రులు మహారాష్ట్రులకేమియు వ్రాసినట్లు కనబడదు. మహారష్ట్రులు ముందుగా రసపుత్రులకు వ్రాసిన కాగితములు మనకుదొరకినవి కాబట్టి భీమసింగీవార్త యెఱుగడు. అని వజీరు పలుక దద్వచనములయందు జక్రవర్తి విశ్వాసముంచి యౌనని తలయూచి నీకెవరివద్ద నివి లభించినవి? అని ఖానును మరల నడిగెను. అంతట ఖాను లేచి చక్రవర్తికభిముఖుడై నిల్చి చేతులు జోడించి, “ఓ మహాప్రభూ! మదనసింగుపై మీకు గల గొప్ప యభిప్రాయమును జెఱుపుటకు నాకిష్టములేదు. అయినను మీ యాజ్ఞ శిరసావహించి రాజ్యము కొఱకును మీ కొఱకును బాటుపడునట్టివాడనగుటచే జెప్పక తప్పదు” అనెను. విని యాశ్చర్యమునొంది మదనసింగు సమాచార మెందుకు? అతని కీ వృత్తాంతము తెలియునా యేమి? వేగముగ జెప్పుమని చక్రవర్తి త్వరపెట్ట ఖాను యిట్లనియె. ఈ కాగితములు నాకు మదనసింగునొద్దనే లభించినవి. అతని దగ్గఱ నీ కాగితములున్నవని నాసేవకులనంపి బలవంతముగ వీనిని దెప్పించితిని. నేనీపని కేవలం రాజభక్తితో నొనర్చినను దారులగొట్టించి దోపిడీ చేసితినని యేలినవారితో దుర్మార్గులు చెప్ప విశ్వసించి నాపయినలుక