పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


హే మ ల త

అతని నుచితగౌరవముతో గూర్చుండ నియమించి చక్రవర్తి యాకాగితములనిచ్చి చదువుమనెను. అతడును నామూలాగ్రముగ వానినెల్ల దనలో జదువుకొని యైదుకాగితములనియు వైదవది మాత్రము ముఖ్యమైనదనియు జెప్పి దాని నిట్లుజదువ నారంభించెను.

   "శ్రీ సూర్యమల ప్రదీపకులగు భీమసింగు మహారాజు వారికి దేవగిరై రామదేవు నమస్తారములుజేసి వ్రాయుచున్న దేమనిన ఈమధ్య మీకును, గ్రూరుడైన యల్లావుద్దీను చక్రవర్తికిని మనస్పర్దలు గలిగినట్లును, జిత్తూరు రాజ్యముపై నతడు దండెత్త నూహించినట్లును మేము వినుచున్నాము. అది నిజమగునేని మిగుల విచారము నొందుచున్నాము. ఈవఱకు దక్షిణ హిందూస్ధానమునకు వచ్చి మమ్మోడించుట మీరు వినియేయుందురు. సమాపదలోనున్న మన మిరువురమును క్షత్రియ కులజులము నేక దేశీయులము నగుటచే నన్యమతస్ధుడు దూరాచారుడునగు చక్రవర్తిపై గలిసి యుద్ధముచేసిన పక్షమున గెలవకపోము. పౌరుషధనులు నభిమాన సముద్రులు నగు మీకు మేము దోడ్పడినయెడల దైవానుగ్రహమువలన ఢిల్లీనుండి మ్లేచ్చులను బాఱదోలవచ్చును. మ్లేచ్చుడగు చక్రవర్తి దురాచారు డగుటచే స్వబలమునందనేకు లతని కనిష్ఠులుగ నున్నారని విని సంతొషించుచున్నాము.  మీ దేశము మీద దండయాత్ర ముందుగ జరుగునేని మాబలమును మీకు సహాయ్యముగ నంపెదము. అది యింతట జరుగుదేని మాకు మీరు సహాయము చేయుడు. నీత విశారదుడగు నీ యోగి మనకుత్తర త్త్యుత్తరముల దెచ్చి యిచ్చుచుండును. దీనికి వెంటనే యుత్తరము నంపగోరుచున్నాను. త్వరపడవలయు;

రామదేవు వ్రాలు"