పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

41

డగునా! అదిగాక రాజపుత్రులఁగలిసి చక్రవర్తిపైఁ గుట్రలుపన్నుచున్నాడు. మతవిరోధియు రాజద్రోహియునగు నీదురాత్మునిఁబట్టి బంధింపవలసినదని చక్రవర్తివద్దనుండి నాకు హుకుము వచ్చినది. అందుచేతఁ బట్టికొన్నాను. అని చెప్పి రెక్కలు వెనుకకు విఱియఁగట్టించి మౌలవిని జెఱకంపెను. కామాతురుడు నీర్ష్యాపీడితుఁడగుటచే రహిమానుఖానొక్కరాత్రి తనబల్వది రోధుల నిర్వురను బట్టుకొన్నందున కానందించుచు సఫలమనోరథుఁడయి వారి నిర్వురఁ జేరియొక గదిలోనుంచి తలుపులుమూయించి తాళములు వేయించెను. తరువాత గడియరాత్రియుండ నతఁడొంటరిగ బయలుదేఱి మఠమునకు వచ్చెను. అప్పుడు తానచట కావలియుంచిన సేవకులిద్దరును గాఢముగ నిద్రించుచుండిరి. హేమలత ప్రథమము మూర్ఛిల్లినచోట లేనందున రహిమానుఖాను గదిలోనికిఁబోయిచూచెను. అందును నామె గన్పడనందున నిల్లు నాలుగు ప్రక్కలను దొడ్లును ఖానుగారు స్వయముగ వెదకికొనిరిగాని హేమలత యగపడలేదు. ఆశాభంగమును దుఃఖమును బాధింప సాహేబొడలెరుఁగక నిద్రించు సేవకులను దన్ని నిద్రలేపి హేమలత యేదిరా? యని యడుగ వారును దిగులుపడి మాటలాడక చూడనారంభించిరి. వారిని వెంటఁబెట్టుకొని ఖాను కోటకుఁ బోయి తన మందిరమున శయనించిగ్రామమున బ్రాహ్మణ క్షత్రియవైశ్యశూద్రవివేచనము లేక ప్రతిగృహమును, మాలమాదిగగూడెములను, మహమ్మదీయులయిండ్లను, నూతులు, గోతులు, చెరువులు మొదలగువానిని వెదకించెను. కాని హేమలత యెందునుగాన బడదయ్యె. తుదకు నిరాశపడి కోపమెట్లును దీరక కావలియుండి పరాకున