పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

హేమలత

మొదలు నఱకిన వృక్షము వలె నేలఁ మూర్ఛిల్లెను. ఆమె మూర్ఛిల్లిన వెనుక నారాయణసింగును రాజభటులు దీసికొనిపోవుటకు వలనుపడెను.

అంతట రహిమానుఖాను సేవకులలోఁగొందఱికాతనినప్పగించి, ఓరీ ముసలివానిని దీసికొనిపోయి కోటలోఁ జెఱలో నుంచుఁడు. నాకింకను బనియున్నది. నేనిప్పుడేవచ్చెదను అని వారలనంపి హేమలతయింటికి నిర్వురు సేవకుల గావలియుంచి తానావల వీధికిఁగొంచెము సాగిపోయెను. అచట నారాత్రి గుమిగూడిన గ్రామస్థులలో హేమలతానారాయణసింగుల దురవస్థఁ దలఁచి కంటఁదడిబెట్టనివారును మహమ్మదీయుని నిందింపనివారును లేరు. కాని యాయుధపాణులయియున్న రాజభటులకు వెఱచి యెవరును సాహసించి యాదురాత్ముల దౌర్జన్యమును మాన్పరయిరి. గారమూర్ఛపొంది హేమలత శరీరము నెఱుఁగక రెండుమూడుసారులు దాదా! దాదా! తెల్లవాఱినదిలెమ్ము అనియు, మదనసింగు, మదనసింగు అనియుఁ బలవరించి మరల మూర్ఛల్లెను. గ్రామస్థులు కావలియున్న రాజభటులకు వెఱచి యామెకు సహాయ మొసఁగకయె క్రమక్రమమున నొకరొక్కరుగఁబోవ నారంభింపఁ గొంత సేపటికి నెవ్వరును లేకపోయిరి. ముష్కర తురుష్కుడు సపరివారముగఁ బట్టణములో మహమ్మదీయుల నివాసముచేయు భాగమునకు బోయి యబ్దుల్ ఖరీమను మౌలవిగృహమును ముట్టడించి సుఖముగ నిద్రించుచున్న మౌలవిని బ్రక్కమీదనే పట్టికొని బంధించెను. అతని భార్యాపుత్రులు కర్తవ్యము నెఱుఁగక గొల్లున నేడ్వసాగిరి. ఆ వీధివారందరు వచ్చి ఖానును గారణమడిగిరి కాని మొదట నాతఁడు నిరుత్తరుఁడై తుదకిట్టు లనియె. ఈతడు మహమ్మదీయుఁడై యుండియు హిందువులతో స్నేహము చేయుచున్నాఁడు. కాఫరులతో నాలోచనల గల యీ పాపాత్ముఁడు సత్యమతస్థుఁ