పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

హేమలత

హేమలతను దాఁటిపోవనిచ్చిన సేవకులఁబిలిచి యం దత్యంతోపకారి యగు వానిని క్షమించి మేధకుఁడగు రెండవవానికి మరణదండన విధించెను. పాపము చిరకాలముదారులు కొట్టి కొట్టి మార్గస్థులఁజంపిచంపి దోషియైఖానునకాప్తుడైన గులామల్లికి నేఁడు మరణము తప్పదయ్యెను. వానిని వృక్షమునకుఁగట్టించి కత్తితో ఖాను తానేనరికివైచెను. అంతకును మనశ్శాంతిలేక పిచ్చివానివలె నటునిటుఁ దిరుగుచు గడ్డము నొకసారి సవరించుకొనుచుఁ గుళ్ళాయి నేలఁబాఱవైచుచు,సేవకులనెల్ల దిట్టుచుఁ జెఱసాలకడకుఁబోయి నారాయణసింగును మనుమరాలివిషయమై యడుగుచు వానిని సంహరించెదనని బెదరించుచు నన్నము ముట్టక సకలావస్థలఁ బొందుచు ఖాను విలపించుచుండెను. ఇది యిటుండ రాధ మరునాటి యుదయమున లేచి హేమలత గృహమునకు వచ్చి మఠమంతయు వెలవెలఁబాఱి చిన్నఁబో పుటయు బాలిక పెంచు రామచిలుక దిగులుపడియుండుటయు నామె యాడుకొనువస్తువులన్నియు నెక్కడివక్కడ నుఁడుటయు ముసలివాని మందులసంచియు వానినెన్నఁడును బాయని చేతి కఱ్ఱయు నటఁ బడియుండుటయుఁ జూచి కఠినచిత్తయయ్యు నామె స్త్రీజనస్వాభావికమగు విచారమును బొందకతప్పదయ్యెను. తరువాత రాధ గృహమునంతను వెదకి హేమలత మ్లేచ్ఛునిపాలఁబడి ముండునవని తన మనోరథ మీడేరునని సంతోషించి హేమలత వస్తువునన్నింటిని వెదకనారంభించెను. తనదగ్గఱనున్న మారుతాళములతో బోషాణముతీసి యందున్న సందుకాపెట్టెమూత తెరచి హేమలత యాభరణములను దొంగిలించి యందున్న రెండు కాగితములను దీసి చదువుకొన్నదగుటచే వానిని మెల్లఁగ