పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

హేమలత

చుందురు. అందుచే నిరంతరానంద మగ్నుఁడై సింగు త్వరలో నారోగ్య స్నానము జేసెను. సింగు సద్గుణవంతుడని సద్వంశ సంభూతుఁ డనుయు నెఱిగి వృద్ధయోగి తన దీనచరిత్రమును రాచకొమరునకుఁ దెలియ పఱపఁ గోరి యాతనితోఁ గూడ నొకటి రెండు సారులు తన యిచ్చ దెలిపెను. అతడును విననుత్సహించెను గాని యోగి యేకారణముననో చెప్పలేదు. చిత్తూరు నుండి బయలుదేరి చిరకాలమగుటచే భీమసింగు మహారాజు తనకయి యెదురు చూచుచుండునని ప్రయాణమై పోవుటకు సిద్ధముగనుండియి యోగి బలవంత పెట్టుటచే మరియొకవార మట నుండసమ్మంతించి యొకనాఁడు రహిమానుఖానుగారి దర్శనముఁజేసి యాకచ్చేరియుఁ గోటయుఁ జూడవలెనని పోయి యనేక రాజకార్యముల ముచ్చటించుచుఁ బ్రసంగవశమున మదనసింగు ఖానుతో నిట్లనియె –

మద – మిత్రుడా? నీవు కోపంపకుందువేని నీకొక సలహా చెప్పెదను.

రహి – మంచిసంగతికి గోపమెందుకు! అవశ్యముగాఁ జెప్ప వలసినదే.

మద – ఈ గ్రామమున మీకీర్తి చక్కగాలేదు. మీరు ప్రజలనవమానము చేయుదురనియు బాధించుచుందురనియు నందరుఁజెప్పుకొనుచుండ వినుటకు నాకుఁ గష్టముగనున్నది. అదిగాక దొఁగతనము మొదలగునవి మీవలన జరుగుచుండునని జనులు దురభిప్రాయముఁ బడియున్నారు. అట్టి దురభిప్రాయమును మీసత్ప్రవర్తనమువలన మీరు పోగొట్టుకొనవలెను. మీదగ్గఱ నున్న తుచ్ఛ సేవకులను ద్వరితముగఁ బంపి వేయుట మంచిది.