పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

153

వాని గలిసికొను సుదిన మెదురు చూచుచుండెను. అంతట నొక సుదినమున సుముహూర్త మేర్పఱచి జనార్ధనసింగు హేమలతా మదనసింగులకు సకల రాజపుత్రముఖ్యులసన్నిధిని మహావిభవముతో భేరీమృదంగాది మంగళధ్వనులతో వివాహము గావించెను. పద్మినిదేవి హేమలత యొక్క వినయాది సుగుణముల మెచ్చియో, పుత్రసమానుడైన మదనసింగుపై గల ప్రేమ నెంచియో, యామెకు సమస్తాభరణములను బెట్టి తనయింట బెండ్లికుమార్తెను జేసెను. చూచినవారందరు నది యనుకూలదాంపత్యమని పొగడ హేమలత మదనసింగును వివాహమాడెను. వివాహమహోత్సవ మైదునాళ్ళును మహా వైభవముతో నడిచెను. మదనసిం గేకపత్నీ వ్రతస్థుడై విద్యావంతురాలయిన యామె సాంగత్యముచే నపార సౌఖ్యము నొందుచు నారాయణసింగుతోడను మామగారితోడను సుఖముగా గాలక్షేపము చేయుచుండెను. వివాహమైన నెలదినముల కబ్దుల్ ఖరీము మౌలవిని మదనసింగు భీమసింగునకు జూపి యాతడు మ్లేచ్ఛరాజ్యమును బాసి చిత్తూరు రాజ్యమున నుండుట కనుజ్ఞ వేడుచుండుట దెలియ జేయ భీమసింగందులకు సంతోషించి యాతనికి నెలకు బదియైదువరాలవేతనముగలయుద్యోగమునిచ్చి యాతని కుటుంబమును గూడ రప్పించెను. ఆనాటనుండియు మౌలవి చిత్తూరు వాస్తవ్యుడై మహారాణా కొలువులో నుండెను.

తరువాత హేమలత సుఖముగనున్న వార్తను శివప్రసాదునకు జంద్రసేనునకు దెలియజేయుటకు మదనసింగు వారికడకు మనుష్యుల నంపెను. హేమలత తనకు గడుసహాయ మొనర్చిన చంద్రావతికుత్తరము వ్రాసి యా