పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

హేమలత

మనుష్యులచేతి కిచ్చెను. హేమలతా మదనసింగుల యనురాగఫలమై, వివాహమైన రెండు సంవత్సరములనాటికి వారి కొక కుమారుడదయించెను. అతనికి మదనసింగు మాధవసింగని తన తండ్రి పేరు పెట్టెను. తరువాత వారి కనేకులు కుమారులు గుమార్తెలం జనించిరి. మదనసింగు రాజభక్తియుక్తుడై తనతండ్రికంటెను బినతండ్రికంటెను బరాక్రమమున బేరు గాంచి శత్రువులకు బక్కలో బల్లెమై రాణాకు గుండెకాయ యై పుత్రపౌత్రాభి వృద్ధి గలిగి వర్ధిల్లుచుండెను.

—సంపూర్ణము—


శ్రీలక్ష్మీ గణేష్ ప్రింటర్స్ విద్యాధరపురం - విజయవాడ 12