పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

హేమలత

ద్రోహము జరుగుటచే నెట్లయిన నల్లాయుద్దీనుపై హిందూ రాజుల బ్రేరేపించి దండెత్తించి కసిదీర్చికొన దలచి నేను దక్షిణహిందూదేశమునకుబోయి మహారాష్ట్ర రాజగు రామదేవుని మీతో గలియున ట్లొడబఱచి వారియొద్దనుండి మీకుత్తరములగూడ దెచ్చితినికాని మధురానగరమున నేనొక పాడు దేవాలయమున యోగివేషముతోనుండ రహిమానుఖాను సేవకులునన్ను యమునానదిలో బడద్రోసి యాకాగితముల నపహరించిరి. ఈత వచ్చినవాడ నగుటచే దైవానుగ్రహమున నే నాజలగండమునుండి బైటబడి, గోసాయి వేషముతో బాలిగ్రామమున కరిగి యచ్చట మా తండ్రియగునారాయణ సింగును నా ముద్దుకూతురగు హేమలతయు బ్రతికియుండుటకు సంతసించి రహిమాను ఖాను హేమలతను చెరబెట్ట నుంకించుచుండ నామెను రక్షించి కుల్వానగరమునకు దోడ్కొనిపోయి నా స్నేహితుడగు శివప్రసాదునింట నుంచితిని. తరువాత రాజస్థానముపై జక్రవర్తి దండెత్తు ననుమాట విని ఢిల్లీనగరమున జరుగుచర్యలను గ్రహించి రాజపుత్రుల కెఱిగింప గోరి కులందరు ఫకీరుగా రహిమానువద్దనుండి రహస్యములు బైటకు దీసితిని. అంతటనుండియు నేనీగరమున జిదానందయోగి వేషముతో నుండి రాజపుత్రుల సేమమునకు నాతపస్సునెల్ల ధార వోసితిని. ఆరాత్రి మహారాణా లక్ష్మణసింగుగారిని మదనసింగు సాహాయము వలచిన రక్షించిన వసంత భట్టును, జ్ఞానానంద స్వాములవారి వేషము వైచికొని యుత్తరముల దెచ్చిన పాండురంగనాధుని బట్టికొని వసంత భట్టును జంపించి పాండురంగనాధుని మీకప్పగించితిని. నే ననేక సేవకుల నుంచుకొని వారిని నానాభాగముల