పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

149

కంపి వసంతభట్టాదుల రహస్యముల నెఱిగి నేడుతురకల నోడించి సఫల మనోరధుడనైతిని. నా పేరు జనార్ధనసింగు. హేమలత నాకూతురు. అంధుడగు నారాయణసింగు నాతండ్రి. హేమలత నావద్దకు వచ్చినది. కాని నాతండ్రిజాడలు దెలియలేదు. ఎఱిగిన నన్ను ధన్యునిజేయుడు. నా కుమార్తెను మదనసింగునకిచ్చి వివాహము చేసెదను. ఇట్లు జనార్ధనసింగు తనపూర్వవృత్తాంతమును సభ్యులకు దెలియజేయ వారాశ్చర్యపడి యందఱు నాతనివంక దృష్టినిలిపి చూచుచుండ హేమలత చిత్తూరు నగరమున నున్న దనియు నామెను దనకిచ్చి వివాహము చేయుట నిశ్చయమనియు జనార్ధన సింగు పలుకుటచే మొదట మదనసింగు మిగుల నుప్పొంగుచు నారాయణసింగు తనగృహమున నున్నట్లా తనితో జెప్పి తనతో రమ్మని పిలిచెను. పాలిగ్రామము నుండి రాజస్థానమున కాయంథుడు వచ్చుట కాశ్చర్యము నొంది జనార్ధనసింగు చిరకాలము క్రిందట జూచిన తనతండ్రిని దర్శింపగోరి రాణా యొద్దను సభ్యులకడను సెలవుగైకొని తన మఠమునకుజని యొక పల్లకిలో హేమలతను గూర్చుండబెట్టి వెంటబెట్టికొని మదనసింగుతో నరిగెను. చిరకాలము నుండి పరస్పర వియోగముగల యాప్తబంధువుల విచిత్రసమ్మేళనమును నేత్రోత్సవముగ జూడగోరి భీమసింగును సభ్యులును మహారాణాతో బయలుదేఱి మదనసింగు గృహమునకు జేరిరి. మదనసింగు తనయదృష్ట వరమున దనగృహమునలంకరించిన మహారాణా ప్రభృతులను యధాశక్తిని గౌరవించి యర్హాసనములిడ వారందరు గూర్చుండిరి. మనుమరాలు గన