పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

135

జక్రవర్తి గుడారమువంక వచ్చి ప్రాణావశిష్టుఁడై యప్పటికిని దన ప్రాణ రక్షణ మొనర్చికొనుచున్న పినతండ్రిని జూచెను. మదనసింగు పినతండ్రి యవస్థను గనుఁగొని యతని శరీరమును బరీక్షించునప్పటికిఁ బ్రతాపుని దేహమున ముప్పది రెండు పెద్దగాయములును నెనిమిది చిన్న గాయములు నుండెను.

మదనసింగు పినతండ్రితో “అయ్యా! మీరు మనశిబిరమునకరుగుడు. మీరింక యుద్ధ మొనర్పలేరు. వ్రణ వైద్యులచే గాయములకుఁ గట్టుకట్టింపుఁడు” అని చెప్ప బ్రతాపుడు “నాయనా! రణమునుండి యింటికి మరణ భయమున నీవఱకు నేనరుగలేదు. నేనింక బోఁజాలను, రక్తవర్షముచే దడిసిన యీ మంటి పరుపుపై బండు కొనియెద. నీవు చక్రవర్తిమీది కరిగి వానిని బట్టుము, లేకున్న వధింపుము. నా నిమిత్తమై విచారింపకుము” అని పలికెను.

మదనసింగు విచారముతోఁ బినతండ్రి ప్రాణముల కాశవదలుకొని చక్రవర్తిమీఁది కరిగెను. చక్రవర్తి యంగరక్షక సైన్యములతో నొక చిన్న గుడారమునుండి సైన్యము పలాయన మగుటకును రాజపుత్రులు చేసిన యుక్తికిని విచారించుచు బ్రాణ సంరక్షణ మొనర్చుకొనుచుండెను, మదనసింగును జూచి యంగరక్షకులు నిశ్చేష్టితలుగా నతడు శత్రుమధ్యమునకుఱికి యాకస్మికముగ సింగపుఁగొదమవలె జక్రవర్తి యెదుట నిలిచి యాయుధ మెత్తులోనఁ జక్రవర్తి సమీపమునసున్న నాజరజంగు వారిరువురకు నడుము వచ్చి నిలిచి ఖడ్గమును త్రిప్పుచు నాతని దాకెను. నాజరుజంగు సమయము