పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

హేమలత

డాలయమున నున్నట్లు జాడగట్టి తన యనుమానమును నందుని చెవిలో వైచెను. సహజలక్షణమైన క్రౌర్యములకు గంజాయిమత్తు తోడ్పడ, వెంటనే నందుఁడు త్రాఁచుపామువలె లేచి మనబాటసారి యున్న వైపున కరుగుచుండగా గలామాతనిని వెంబడించెను. అదివఱకే భయకంపితుఁడైన మన తెరువరి యీ దురాత్ములు తనవైపు వచ్చుచుండుటఁజూచి కెవ్వుననఱచి స్మృతి యెఱుఁగక తనయున్నస్థలమునుండి క్రిందఁబడెను, ఆతనిఁజూచి నందుడును గులామును నాశ్చర్యపడి యొండొరులతో నిట్లు సంభాషించిరి.

నందు – అరే! అన్నయ్య! ఎవఁడురా వీఁడు?

గులా – ఎవఁడో మనమాటలువిని మనగుట్టుబైటఁబెట్టదలంచినదొంగ.

నందు – ఈ ఛండాలు నిప్పుడేమి చేయుదము? ఏదీ కత్తి యిలాగునతే.

గులా – కత్తితోఁ గొట్టవద్దు. ఈలాగునఁ జేయుదము. (అని చెవిలో రహస్యముగాఁ జెప్పెను)

అట్లిరువురుఁ గూడఁ బలుకుకొని నిస్పృహహృదయుడై యున్న యాదీనునినోట గడ్డలంగ్రుక్కి శిరస్సునొకరును బాదములొకరును బట్టుకొని మోసికొనిపోయి యతండు గిజగిజ తన్నుకొనుచున్నను వదలక నదీతీరముఁ జేరి లోతునీటఁదిగి, చావు ముండకొడక, యని వాని నందుఁబాఱవైచిరి. తరువాత వారిరువురు నాలయమునకు వచ్చి యాతని కక్షపాలను వెదకి యందుండి కొన్ని వస్తువులను సంగ్రహించి తమ ప్రియమిత్రుడై న బాలాజీ రాఁడని నిశ్చయించుకొని యధేచ్ఛం జనిరి.