పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

హేమలత

నిమిత్తమో నిరీక్షించుచుండిరి. ఇట్లుకొంతసేపు చూచి వారిరువురు లోనఁ బ్రవేశించిరి. అందొకఁడు మహారాష్ట్రుఁడు; రెండవవాఁడు తురుష్కుఁడు. తురుష్కుఁడు దీర్ఘకాయము తోను, దూలమువలెనున్న భుజద్వయముతోను గుండెలను దాఁకుచున్న నల్లని గడ్డముతోడను జూచువారికందఱకును భయమును గల్గించుచుండెను. భయంకరమైన యాతని ముఖావలోకనము జేసిన వారందఱును దయమున దతనియందును లేదని నిశ్చయముగఁ జెప్పఁగలరు. మహారాష్ట్రుడు కొంచెము గొప్పకుటుంబమునం దుద్భవించినను గాలవశమున ధనాదులు గోలుపోయి దురాచారుల స్నేహముఁజేసి దౌర్జన్యము లందారితేఱెను గాని ముఖవిలాసముజూడ గొంచెము జాలిగల వాడని తోచును. అయినను దొంగతనము మనుష్యవధ మొదలగు దుష్కార్యముల నాచరించునెడ జంకును సందేహమును నిరువురకును లేవు. అదివఱకు గోడలకు జేరవైచిన ఖడ్గముల నొరలలోనుంచి వారు దేవళము మును ముందఱఁ గూర్చుండి యేదోఁ యోజింపుచుండిరి. అందు మహమ్మదీయుఁడు మహారాష్ట్రుని జూచి యిట్లనియె.

నందా! బాలాజీ యింకను రాకుండటకు నేమి కారణము? అతనిని మార్గమునం దెవరైనఁ బట్టుకొనియుందురా?

నందు — గులామల్లీ! నీకింత వెఱ్ఱియెందుకు! మనబాలాజీ యిదివఱకెన్నఁడైన నొకరిచేతఁ జిక్కెనా? ఆతఁడు దేవాంతకుఁడని యెఱుగఁవా?

గులా — అవును! నేనెఱుగుదును. అందుచేతనే మనకీవఱకెన్నడును జక్రవర్తివలన భయము లేదు. మనరహస్యము బయలుపడలేదు.