పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

103

బట్టుచున్నారు. తలుపులు మూయబడియున్నవి. మీరామె ప్రాణములను రక్షింపవలెను అనిచెప్ప వారందరు గోపొద్దీపితులై గడ్డపారలతో దలుపులు బ్రద్దలుగొట్టి లోన బ్రవేశించిరి. అప్పటికి రహిమానుఖానును గంబళి కప్పుకొని మార్గప్రదర్శకుడైన నందుడును పాఱిపోయిరి. బంగారుబొమ్మవలె హేమలత నేలబడి యప్పుడే తెలివి దెచ్చుకొని కనుల మూసికొని భయముతో అయ్యో దైవమా! అని యేడ్చుచుండెను. వారామెను లేవదీసి యాదుర్మార్గులందు లేరని యామెకు ధైర్యము చెప్పిరి. ఆ వచ్చినవారిలో జక్రవర్తి యొద్ద గొప్పయుద్యోగమున నున్న చంద్రసేనుడను బంగాళాక్షత్రియుడు డొకడుండెను. ఆయన యేబది యేండ్ల వయస్సు గల వాడగుటను సకలకష్టసుఖములు దాటిన వాడగుటను బాలికపై జాలిగలిగి తన యింటికి రమ్మని లాహిరిసమేతముగ నామెను గొనిపోయెను. అందరును రహిమానుఖానును నిందించుచు నిండ్లకు జనిరి. ఆయింటిదొడ్డిలో జెట్లక్రింద దాగికొని యున్న రహిమానుఖానును నందుడును మనుష్యుల సందడి తగ్గినతోడనే మరల గృహముబ్రవేశించిరి. అంతట రహిమానుఖాను విచారగ్రస్తుడై రెండుసారులు తనకు భంగపాటు గలుగుటకు జింతిల్లి నందునితో నందా! పాపము, నీవు బిచ్చగాని వేషము వైచికొని గ్రామములెల్ల దిరిగి హేమలత యున్నచోటెరిగి వచ్చి నాకుపకారము జేసినావు. మనము మదనసింగు పేరుపెట్టి ఆమెను రప్పించినాము గాని నామనోరధము సఫలముకాలేదు. నీశ్రమకైనను దైవము మెచ్చలేదు గదా, యని నిట్టూర్పు విడుచుచు నాయిల్లివిడిచి నందునితో గూడ బోయెను.

అట్లు చంద్రసేను డామెను గృహమునకు గొనిపోయి భోజనము బెట్టించి తరువాత నిట్లనియె. అమ్మా నీవును క్షత్రియకన్యవని చెప్పు