పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

హేమలత

చున్నావు. నీవు మాయింట నుండవచ్చును కాని యిక నాలుగు దినములకు మా చక్రవర్తి చిత్తూరుపై దండయాత్ర కరుగుచున్నాడు. నేను నా కుటుంబముతో నరుగుచున్నాను. నీవు వచ్చిన యెడల వెంట దీసికొని పోవుదును. రానియెడల నిన్నెవరి కప్పగించి పోవలెనో తోచకున్నది. అని చెప్ప నామె యాతనితో చిత్తూరు బోయెద ననెను. లాహిరి హేమలతతో గూడ చంద్రసేనుని యింట మూడుదినములుండి కుల్వానగరమునకు బోయి యావార్త శివప్రసాదున కెఱింగించెను.