పుట:Hello Doctor Final Book.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాయామములతో హృదయమునకు ప్రాణవాయువు అవసరాలు పెరిగినపుడు, ఆ అవసరములు తీరక గుండెనొప్పి (Angina) కలుగుతుంది. రక్తప్రసరణ లోపము (ischemia) తీవ్రతరము అయినపుడు హృదయపు లయ తప్పే అవకాశము ఉన్నది. జఠరికలు లయ తప్పి జఠరిక ప్రకంపనము (ventricular fibrillation) లోనికి వెళ్తే ప్రాణాపాయము కలుగుతుంది. ఒక్కోసారి ఒక హృద్ధమని పూర్తిగా మూసుకుపోవచ్చును. ధమనిలో ఫలక ఏర్పడి ఆ ఫలక చిట్లి దానిపై రక్తము గడ్డకట్టి రక్తప్రసరణకు తీవ్ర అవరోధము కలిగితే, హృదయ కండరజాలములో కొంత భాగము ప్రాణ వాయువు, పోషకపదార్థములు అందక మరణిస్తే గుండెపోటు (myocardial infarction) కలుగుతుంది. మానుదల ప్రక్రియలో ఆ మరణించిన కండర కణజాలమునకు బదులు పీచుకణజాలము ఏర్పడుతుంది. అపుడు హృదయ వ్యాపారము క్షీణిస్తుంది. హృద్ధ మనీ వ్యాధులకు కారణములు (Risk factors for coronary artery disease)      

వయస్సు పెరుగుతున్న కొలది ధమనులలో కాఠిన్యత పెరుగుతుంది. రక్తపీడనము హెచ్చుగా ఉన్నవారిలో హృద్ధమని వ్యాధులు ఎక్కువగా కలుగుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్థులలోను, అల్పసాంద్రపు లైపోప్రోటీనులు (Low Density Lipoproteins) అధికముగా ఉన్నవారిలోను, అధికసాంద్రపు లైపోప్రోటీనులు (High Density Lipoproteins) తక్కువగా ఉన్నవారిలోను, ట్రైగ్లిసరైడులు బాగా ఎక్కువగా ఉన్నవారిలోను, పొగత్రాగే వారిలోను, స్థూలకాయము గలవారిలోను (భారసూచిక 18.5-24.9 పరిమితులలో ఉండుట మేలు. నడుము చుట్టుకొలత పురుషులలో 40 అంగుళముల లోపు స్త్రీలలో 35 అంగుళముల లోపు  ఉండుట మేలు), దగ్గఱి కుటుంబ సభ్యులలో పిన్నవయస్సులోనే (పురుషులలో 55 సంవత్సరముల లోను, స్త్రీలలో 65 సంవత్సరములలోను) హృదయ రక్తప్రసరణలోప వ్యాధులు (ischemic heart diseases) కలిగిన వారిలోను హృద్ధమనీ వ్యాధులు కలిగే అవకాశములు హెచ్చు.ధూమపానము సలిపేవారు ధూమపానము పూర్తిగా 15 సంవత్సరములు మానివేస్తే వారిలో హృద్ధమనీ

98 ::