పుట:Hello Doctor Final Book.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

cus) వఱకు పయనిస్తుంది. ఇది కుడి మేరధమని (right marginal artery), పర అవరోహణ ధమని (posterior descending artery) అను శాఖలుగా చీలుతుంది. దక్షిణ హృద్ధమని కుడి జఠరికకు, ఎడమ జఠరికలో 25-35 శాతపు భాగమునకు రక్తప్రసరణ సమకూరుస్తుంది. ధమనుల గోడలలో బయటపొర (tunica externa or adventitia), మధ్యపొర (tunica media), లోపొర (tunica interna or intima) అనే మూడు పొరలు ఉంటాయి. బయటపొరలో సాగుకణజాలము (elastic tissue), పీచుకణజాలము (fibrous tissue) ఉంటాయి. మధ్యపొరలో మృదుకండరములు (smooth muscles), సాగుకణజాలము (elastic tissue), పీచుపదారము ్థ (collagen) ఉంటాయి. నాళముల లోపొర పూతకణములు (lining cells), సాగుపదారము ్థ (elastin), పీచుపదార్థముల (collagen) మూలాధారమును అంటిపెట్టుకొని ఉంటాయి. హృద్ధ మనుల వ్యాధి ( Coronary artery disease ) :

హృద్ధమని వ్యాధి అంటే పరోక్షముగా హృద్ధమనుల కాఠిన్యతగా (Atherosclerosis) భావించాలి. ధమనీకాఠిన్యత (arteriosclerosis) శైశవము నుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత ప్రస్ఫుటమయి వృద్ధాప్యములో తీవ్రతరము అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొర (intima) క్రింద కొవ్వులు, కొలెష్టరాలు, కాల్సియం, తాపక కణములు పేరుకొని ఫలకలుగా (plaques) పొడచూపుతాయి. ధమనుల గోడలోని మృదుకండరముల మధ్య కాల్సియమ్ ఫాస్ఫేట్ నిక్షేపములు కూడుకున్నపుడు హృద్ధమనులు బిఱుసెక్కుతాయి. ధమనీకాఠిన్యపు ఫలకలు ధమనులలోనికి ఉబుకుట వలన ధమనుల లోపలి పరిమాణము తగ్గి అవి సంకుచితము అవుతాయి. ఈ ఫలకలు హృద్ధమనులలో ఒకటి రెండు చోట్లే ఉండవచ్చును, లేక ఎక్కువగా ఉండవచ్చును. ధమనులలో హెచ్చుభాగము కాఠిన్యత పొందవచ్చును. హృద్ధమనులు, వాటి శాఖలలో నాళాంతర పరిమాణము 40 శాతము కంటె తక్కువగా తగ్గినపుడు రక్తప్రవాహమునకు చెప్పుకోదగ్గ అవరోధము కలుగదు. రక్తనాళములలో ఫలకలు స్థిరముగ ఉండి నాళాంతర  పరిమాణము 4070 శాతము తగ్గినపుడు రక్త ప్రవాహమునకు అవరోధము కలిగి శ్రమ,

97 ::