పుట:Hello Doctor Final Book.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొంతమందిలో మధ్యస్థ ధమని (intermediate artery) అనే మూడవ శాఖ కూడా ఉంటుంది. వామ పూర్వఅవరోహణ ధమని రెండు జఠరికల మధ్య ముందుభాగములో ఉన్న గాడిలో (పూర్వ జఠరికాంతర గర్తము ; anterior inter ventricular sulcus) క్రిందకు పయనిస్తుంది. దీని కుడ్య శాఖలు (septal branches) రెండు జఠరికల మధ్య ఉన్న గోడ (జఠరికాంతర కుడ్యము ; inter ventricular septum) ముందు రెండు భాగములకు రక్తప్రసరణ సమకూరుస్తాయి. ఈ వామ పూర్వ అవరోహణ ధమని (left anterior descending artery) నుంచి వచ్చే వక్ర శాఖలు (diagonal branches) ఎడమ జఠరిక పార్శ్వభాగమునకు రక్తప్రసరణ సమకూరుస్తాయి. వామపూర్వ అవరోహణధమని గుండె ఎడమ జఠరికకు సుమారు 50 శాతపు రక్తప్రసరణను సమకూరుస్తుంది.

వామ పరిభ్రమణ ధమని (left circumflex artery) ముందు ఎడమ దిశలో అడ్డముగా పయనించి గుండె వెనుక కుడి దిశలో పర జఠరికాంతర గర్తము (posterior inter ventricular sulcus) వఱకు పయనించి దక్షిణ హృద్ధమని శాఖతో కలుస్తుంది. 15 శాతము మందిలో పర అవరోహణ ధమని (posterior descending artery) ఏర్పడుటలో వామ పరిభ్రమణ ధమని  ముఖ్యపాత్ర వహిస్తుంది. 85 శాతము మందిలో పర అవరోహణ ధమని ఏర్పాటునకు దక్షిణ హృద్ధమని ముఖ్యపాత్ర వహిస్తుంది. వామ పరిభ్రమణధమని ఎడమ జఠరిక వెనుక భాగమునకు, పక్క భాగమునకు రక్తప్రసరణ సమకూరుస్తుంది. పర అవరోహణ ధమని (posterior descending artery) కుడి జఠరిక ఎడమ జఠరికల మధ్య ఉన్న గోడలో (జఠరికాంతర కుడ్యము; inter ventricular septum)  వెనుక మూడవవంతు భాగమునకు, జఠరికల క్రింది భాగములకు రక్తప్రసరణ సమకూరుస్తుంది. దక్షిణ హృద్ధ మని ( Right coronary artery ) :

దక్షిణ హృద్ధమని బృహద్ధమని (aorta) నుంచి కుడి కవాట పత్రము మీద మొదలవుతుంది. ఇది కుడి కర్ణిక కుడి జఠరికల మధ్య ఉన్న గర్తములో పర జఠరికాంతర గర్తము (posterior inter ventricular sul:: 96 ::