పుట:Hello Doctor Final Book.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

థీనోపై రిడిన్ ఉత్పన్నములు ( theinopyridine derivatives) :

ఇవి కూడా రక్తఫలకములు గుమికూడుటను అరికడుతాయి. వీటిని ఏస్పిరిన్ పడని వారిలోను, గుండెపోటుల వంటి సత్వర హృద్ధమని వ్యాధులలోను (acute coronary syndrome), హృద్ధమనులలో వ్యాకోచసాధనములను (stents) కొత్తగా అమర్చినవారిలోను వాడుతారు. క్లొపిడోగ్రెల్ (Clopidogrel), టైక్లోపైడిన్ (Ticlopidine), ప్రాసుగ్రెల్ (Prasugrel) ఈ తరగతిలోని కొన్ని మందులు. ఏంజియోటెన్సిన్ కన్వెర్ట ింగ్ ఎంజై మ్ అవరోధకములు (Ace inhibitors):

హృద్ధమని వ్యాధిగ్రస్థులలో మధుమేహము, రక్తపుపోటు, హృదయ వైఫల్యము  ఉన్నవారిలో ఇవి చాలా ఉపయోగకరము. ఏస్ అవరోధకములు వాడలేనివారిలో ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములను (Angiotensin receptor blockers) వాడుతారు. చర్మము ద్వారా హృద్ధ మని వ్యాకోచ చికిత్సలు ( Percutaneous Coronary Intervention ):

ఔషధములతో గుండెనొప్పులు తగ్గని వారిలో చర్మము ద్వారా కృత్రిమ నాళపు (catheter) బుడగలతో హృద్ధమనులలోనికి వెళ్ళి వాటిని వ్యాకోచింప జేస్తారు. ఆ వ్యాకోచమును నిలుపుటకు వ్యాకోచసాధనములను (stents) హృద్ధమనులలో అమర్చగలరు. హృద్ధ మని అవరోధ అధిగమన శస్త్రచికిత్స (Coronary artery bypass grafting) :

హృద్ధమని వ్యాధి విస్తృతముగా ఉన్నపుడు, వామహృద్ధమని (left main coronary artery), వామ పూర్వఅవరోహణ ధమనులలో (left anterior descending artery) తీవ్రసంకుచితములు ఉన్నపుడు, బహుళ హృద్ధమనులలో వ్యాధి సంకుచితములు తీవ్రముగా ఉన్నపుడు తొడలు, కాళ్ళ నుంచి గ్రహించిన దృశ్యసిరల (saphenous vein) భాగములను కాని, అంతరస్తన ధమనిని (internal mammary artery) కాని అవరోధముల

93 ::