పుట:Hello Doctor Final Book.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తరువాత భాగములో హృద్ధమనులకు శస్త్రచికిత్సతో సంధానించి హృదయము నకు రక్తప్రసరణను పునరుద్ధింపజేయవచ్చును. దృశ్యసిరల (saphenous vein) భాగములను వాడునపుడు వాటి ముందు కొనలను బృహద్ధమనికి సంధానిస్తారు. ఈ చికిత్సల వలన గుండెపోటులు, మరణములు తగ్గుతాయి.

94 ::