పుట:Hello Doctor Final Book.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హృదయవైఫల్యము కలవారిలోను వీటిని వాడకపోవుట మంచిది. డైహైడ్రో పైరిడిన్ తరగతికి చెందిన కాల్సియం మార్గ అవరోధకములు రక్తనాళములను వ్యాకోచింపజేస్తాయి. హృదయ సంకోచమును తగ్గించవు, హృదయ మాంద్యమును కలుగజేయవు. వీటిని బీటా అవరోధకములతోను, హృదయ వైఫల్యము గలవారిలోను వాడవచ్చును. సత్వర కాల్సియమ్ మార్గ అవరోధకములు (short acting calcium channel blockers) గుండెపోటులు, మరణములు కలుగజేయగలవు కావున వీటిని వాడకూడదు. దీర్ఘకాలిక కాల్సియమ్ మార్గ అవరోధకములు వాడుట మేలు. దీర ్ఘకాలపు నై ట్రేటులు ( long acting nitrates ):

ఇవి హృద్ధమనులను వ్యాకోచింపజేస్తాయి, సిరలను వ్యాకోచింపజేసి జఠరికలలో వికాసము చివర ఉండే (రక్త) ప్రమాణమును (end diastolic volume) తగ్గించి హృదయ భారమును తగ్గిస్తాయి. అధికమోతాదులలో ధమనుల పీడనమును కూడా తగ్గిస్తాయి. గుండెనొప్పులను తగ్గిస్తాయి. ఈ నైట్రేటులకు దేహపు సహనము (tolerance) పెరుగకుండుటకై వీటిని 12 గంటల విరామముతో వాడుట మేలు.  Phosphodiesterase -5 inhibitors (sildenafil, vardenafil, tadalafil) లను వాడేవారు నైట్రేటులను వాడకూడదు. రెనొలజిన్ ( Ranolazine ):

పై మందులతో గుండెపోటులు తగ్గనివారికి రెనొలజిన్ వాడవచ్చును. గుండెవేగము పైన రక్తపీడనము పైన రెనొలజిన్ ప్రభావము ఉండదు. కాని వెరాపమిల్, డిల్టియజిమ్ లు వాడే వారిలో విద్యుత్ హృల్లేఖనములలో qt విరామమును పెంచగలవు కావున తగిన పరిశీలన, జాగ్రత్త అవసరము . ఏస్పిరిన్ ( Aspirin ) :

హృద్ధమనీ వ్యాధి కలవారిలో  ఏస్పిరిన్ రక్తఫలకములు (platelets) గుమికూడుటను అరికట్టి గుండెపోటులను, మరణములను తగ్గి స ్త ుం ది. జీర్ణమండలములో రక్తస్రావములు (bleeding) లేనివారిలోను, ఏస్పిరిన్ అసహనములు లేనివారిలోను ఏస్పిరిన్ తప్పక వాడాలి.

92 ::