పుట:Hello Doctor Final Book.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుండె నొప్పులను (angina) నివారించుటకు వివిధ ఔషధముల సమన్వయము వాడుతారు. బీటా గ్రాహక అవరోధకములు ( beta blockers ):

బీటా ఎడ్రినెర్జిక్ అవరోధకములు హృదయ వేగమును, హృదయ సంకోచమును (contractility) తగ్గించి హృదయమునకు ప్రాణవాయువు అవసరాలు తగ్గి స్తా యి. గుండెనొప్పుల (angina) తఱచుదనమును, గుండెనొప్పుల తీవ్రతను, గుండెపోటులను (heart attacks), గుండెపోటులచే కలుగు మరణములను తగ్గిస్తాయి. మెటోప్రొలోల్ (metoprolol) తఱచు వాడబడే ఔషధము. విరామ సమయములలో గుండెవేగము 50-60 లో ఉండునట్లు బీటా గ్రాహక అవరోధకముల మోతాదును సవరించాలి. తీవ్రమైన ఉబ్బస (Bronchial Asthma), తీవ్ర దీర్ఘకాల శ్వాస అవరోధక వ్యాధి (Chronic obstructive pulmonary disease), హృదయమాంద్యము (bradycardia), హృదయవైఫల్యము (Congestive heart failure) ప్రస్ఫుటమై ఉన్నపుడు బీటా అవరోధకములను జాగ్రత్త గా వాడాలి. రక్త పీ డనమును కూడా జాగ్రత్త గా గమనిస్తూ ఉండాలి. కాల్సియమ్ మార్గ అవరోధకములు (Calcium channel blockers) :

ఈ ఔషధములు కణముల కాల్సియం మార్గములను బంధించి కాల్సియం గమనమును అరికట్టి రక్తనాళములలో మృదుకండరముల సంకోచమును తగ్గించి ధమనులను వ్యాకోచింపజేసి హృదయమునకు రక్తప్రసరణ పెంచుతాయి. రక్తపీడనమును తగ్గించి జఠరికలపై భారము తగ్గిస్తాయి. హృదయ సంకోచమును (contractility) కూడా తగ్గిస్తాయి. బీటా అవరోధకములను వాడలేనివారిలోను, బీటాఅవరోధకములు గుండెనొప్పులను (angina) అరికట్టలేనపుడు వాటికి తోడుగాను కాల్సియం మార్గ అవరోధకములను వాడుతారు. డైహైడ్రోపైరిడిన్  (Dihydropyridine) తరగతికి చెందని (ఉదా : వెరాపమిల్  (Verapamil), డిల్టియజెమ్ (diltiazem) కాల్సియం మార్గ అవరోధకములు హృదయవేగమును తగ్గిస్తాయి, హృదయ సంకోచమును కూడా తగ్గిస్తాయి. కాబట్టి హృదయ మాంద్యము (bradycardia) కలవారిలోను,

91 ::