పుట:Hello Doctor Final Book.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిత్రీకరణము ప్రామాణిక పరీక్ష.

ఛాతినొప్పి కలిగిన వారిలో హృదయ రక్తప్రసరణ లోపము (ischemia), పుపుస ధమనిలో ప్రసరణ అవరోధకములు (Pulmonary embolism), పుపుసవేష్టనములో వాయువు (Pneumothorax), విచ్ఛేదన బృహద్ధమని బుద్బుదములు (Dissecting aortic aneurysms), వంటి ప్రాణాపాయకరమైన వ్యాధులకై వైద్యులు శోధించాలి.

చికిత్స :

హృద్ధమని వ్యాధిగ్రస్థులు వారి వ్యాధికి కల కారణములను అదుపులో పెట్టుకోవాలి. పొగత్రాగుట పూర్తిగా మానివేయాలి. మధుమేహవ్యాధిని (Diabetes mellitus), రక్తపు పోటును (hypertension) అదుపులో పెట్టుకోవాలి. భోజనములో కొలెష్ట్రా లు , సంతృప్త పు కొవ్వుపదార్థ ము ల (saturated fats) వాడుకను నియంత్రించుకోవాలి. అల్పసాంద్ర లైపో ప్రోటీనుల (low density lipoproteins) విలువలు 100 మి.గ్రాలు / డె.లీ కంటె తక్కువ ఉండునట్లు స్టాటిన్ మందులను వాడుకోవాలి. వీరికి దినమునకు అరగంట నుంచి గంట వఱకు వ్యాయామము అవసరము. స్థూలకాయులు బరువు తగ్గే ప్రయత్నాలు చేయాలి.

ఔషధములు :

హృద్ధమనివ్యాధి స్థిరముగా ఉన్నవారిలో (Chronic stable angina) ఔషధ చికిత్స ఫలితములు ధమనీవ్యాకోచ చికిత్సల (angioplasty) ఫలితములతో సమతుల్యముగా ఉంటాయి.

హృదయమునకు ప్రసరణ లోపములు ఉన్నవారికి గుండెనొప్పులను తగ్గించుట, గుండెపోటులు  (myocardial infarctions) నివారించుట, మృత్యువాత పడకుండా చేయుట చికిత్స లక్ష్యము. గుండెనొప్పి వచ్చినపుడు నొప్పి నివారణకు విరామముతో బాటు, నాలుక క్రింద నైట్రోగ్లిసరిన్  బిళ్ళల రూపములో కాని, జల్లుగా (తుంపర సాధనములతో) గాని, వాడుకోవాలి.

90 ::