పుట:Hello Doctor Final Book.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(coronary disease with narrowings) ఉండే అవకాశములు ఎక్కువ. వారికి వ్యత్యాస పదార్థములతో (contrast materials) హృద్ధమనుల చిత్రీకరణము (Coronary angiography), ఆపై  అవసరమయితే హృద్ధమనుల వ్యాకోచ చికిత్సలు  చేస్తారు. గణనయంత్ర హృద్ధ మనీ చిత్రీకరణ (CT Coronary angiography) :

ఈ పరీక్ష వలన హృద్ధ మ నుల నిర్మాణములో అసాధారణములు తెలుస్తాయి. రక్త ప్రసరణలోపములు (ischemia) ప్రస్ఫుటము కావు.

వ్యాయామముతో కాని ఔషధములతో కాని అయస్కాంత ప్రతిధ్వని హృదయప్రసరణ చిత్రీకరణములు (Magnetic resonance perfusion imaging) చేసి రక్తప్రసరణ లోపములను, ఇతర అసాధారణములను కనుగొనగలరు. హృద్ధ మనుల చిత్రీకరణము ( Coronary angiography ) :

ఈ పరీక్షలలో, ఊరుధమని (Femoral artery) లేక ముంజేతి బహిర్ధమని (radial artery) ద్వారా కృత్రిమనాళమును (catheter) బృహద్ధమని లోనికి, ఆపై హృద్ధమనులలోనికి చొప్పించి వ్యత్యాస పదారము ్థ లను చిమ్మి, ఎక్స్ రే చిత్రములతో హృద్ధమనులను, వాటి శాఖలను చిత్రీకరిస్తారు. ఈ పరీక్షలు ధమనులలో సంకుచితములను, వాటి తీవ్రతను, తెలుసుకొనుటకే కాక వాటికి చికిత్సామార ్గ ము లను నిర్ణ యిం చుటకు కూడా ఉపయోగ పడుతాయి. ఎడమ జఠరికలోనికి వ్యత్యాసపదార్థములను చిమ్మి, ఎడమ జఠరిక పరిమాణమును, వ్యాపారమును, కవాటములలో అసాధారణములను కనుగొనుటకు ఈ పరీక్షలు తోడ్పడుతాయి. అవసరమయిన వారికి హృద్ధమనుల వ్యాకోచ చికిత్సలు చేసి వ్యాకోచ సాధనములను (stents) అమర్చ వచ్చును. ఈ పరీక్షల వలన వ్యత్యాస పదార్థములకు వికటత్వము (anaphylaxis) కలుగుట, సత్వర మూత్రాంగ విఘాతము (Acute Kidney Injury), దూరధమనులలోనికి కొలెష్ట్రాలు ప్రసరణ అవరోధకములు (emboli) చేరుట, రక్తస్రావము (hemorrhage) వంటి ఉపద్రవములు కలిగే అవకాశములు ఉన్నాయి. హృద్ధమనుల వ్యాధి నిర్ణయమునకు హృద్ధమనుల

89 ::