పుట:Hello Doctor Final Book.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాయామపు ఒత్తిడి పరీక్షలు ( Exercise Stress Tests ) :

గుండెనొప్పి కలిగినవారిలో విరామ విద్యుత్ హృల్లేఖనములో మార్పులు హెచ్చుగా లేనపుడు, వ్యాయామము చేయగలిగిన వారికి వ్యాయామ హృదయ విద్యుల్లేఖన (exercise electrocardiography) పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు  65%  మందిలో వ్యాధి గ్రహణత (sensitivity; వ్యాధిని కనుగొనుట), 75 శాతము మందిలో వ్యాధి నిర్దిష్టత (specificity; వ్యాధిని రూఢీకరించుట) కలిగి ఉంటాయి.

వ్యాయామముతో హృదయకండరములో రక్తప్రసరణ లోపములను (myocardial perfusion defects) రేడియోధార్మిక పదార్థ ము లు (థాలియం 201) ఉపయోగించి చిత్రీకరించవచ్చును. వ్యాయామముతో ప్రతిధ్వని హృదయచిత్రీకరణములు (exercise echocardiography) కూడా ఉపయోగకరమే. వ్యాయామ ప్రతిధ్వని హృదయ చిత్రీకరణములు, వ్యాయామ హృదయప్రసరణ చిత్రీకరణములు (exercise myocardial perfusion imaging) 80- 85 శాతపు వ్యాధిగ్రహణతను (sensitivity) 77-88% వ్యాధి నిర్దిష్టతను (specificity) కలిగి ఉంటాయి.

వ్యాయామము చేయలేని వారిలో  హృదయసంకోచమును పెంచు (inotropic agent) డోబుటమిన్ (dobutamine) ఔషధము ఉపయోగించి ప్రతిధ్వని హృదయ చిత్రీకరణముతో  ఒత్తిడి పరీక్షలు చేస్తారు. రక్తప్రసరణ లోపించిన భాగములలో సంకోచము పరిమితముగా ఉంటుంది.

డైపిరిడమాల్ (dipyridamole), ఎడినొసైన్ (adenosine), రెగడినొసన్ (regadenoson) వంటి రక్తనాళ వ్యాకోచక ఔషధములను (vasodilators) ఇచ్చి, రేడియోథార్మిక పదార్థములతో హృదయకండర ప్రసరణ పరీక్షలు (myocardial perfusion studies) చేస్తారు. సాధారణముగా ఒత్తిడి పరీక్షల ఫలితములు బాగున్నపుడు హృదయమునకు రక్తప్రసరణ బాగున్నట్లు నిర్ణయించవచ్చును. ఈ పరీక్షలలో  అసాధారణములు చాలా ఉన్నపుడు బహుళ హృద్ధమనులలో ధమనీకాఠిన్యత, సంకుచితములు

88 ::