పుట:Hello Doctor Final Book.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాపారము క్షీణిస్తుంది. హృద్ధ మనీ వ్యాధులకు కారణములు (Risk factors for coronary artery disease) :

వయస్సు పెరుగుతున్న కొలది ధమనులలో కాఠిన్యత పెరుగుతుంది. రక్తపీడనము హెచ్చుగా ఉన్నవారిలో హృద్ధమని వ్యాధులు ఎక్కువగా కలుగు తాయి. మధుమేహ వ్యాధిగ్రస్ల థు లోను, అల్పసాంద్రపు లైపోప్రోటీనులు (Low Density Lipoproteins) అధికముగా ఉన్నవారిలోను, అధిక సాంద్రపు లైపోప్రోటీనులు (High Density Lipoproteins) తక్కువగా ఉన్న వారిలోను, ట్రైగ్లిసరైడులు బాగా ఎక్కువగా ఉన్నవారిలోను, పొగత్రాగే వారిలోను, స్థూలకాయము గలవారిలోను (భారసూచిక 18.5-24.9 పరిమితు లలో ఉండుట మేలు. నడుము చుట్టుకొలత పురుషులలో 40 అంగుళముల లోపు స్త్రీలలో 35 అంగుళముల లోపు  ఉండుట మేలు.), దగ్గఱి కుటుంబ సభ్యులలో పిన్నవయస్సులోనే (పురుషులలో 55 సంవత్సరములలోను, స్త్రీలలో 65 సంవత్సరములలోను) హృదయ రక్తప్రసరణలోప వ్యాధులు (ischemic heart diseases) కలిగినవారిలోను హృద్ధమనీవ్యాధులు కలిగే అవకాశములు హెచ్చు. ధూమపానము సలిపేవారు ధూమపానము పూర్తిగా 15 సంవత్సరములు మానివేస్తే వారిలో  హృద్ధమనీ వ్యాధులు కలిగే అవకాశము ధూమపానము సలుపని వారితో సమానము అవుతాయి.

రక్తపరీక్షలలో C reacttive protein 2 mgm /dl మించిన వారిలోను, హృద్ధమనులలో కాల్సియం ప్రమాణములు పెరిగిన వారిలోను, దూరధమని వ్యాధులు (Peripheral Arterial Diseases) కలవారి లోను హృద్ధమని వ్యాధులు కలిగే అవకాశములు హెచ్చు. రక ్తప్రసరణలోప హృదయవ్యాధి లక్షణములు :

హృద్ధమనులలో కాఠిన్యపు ఫలకలు (plaques) స్థిరముగా ఉండి రక్తప్రసరణకు తగినంత అవరోధము కలిగిస్తే ప్రసరణలోప లక్షణములు శ్రమతో పొడచూపుతాయి. శారీరక శ్రమ చేసినపుడు శరీరమునకు రక్త

85 ::