పుట:Hello Doctor Final Book.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీచుపదార్థముల (collagen) మూలాధారమును అంటిపెట్టుకొని ఉంటాయి. హృద్ధ మనుల వ్యాధి ( Coronary artery disease ) :

హృద్ధమని వ్యాధి అంటే పరోక్షముగా హృద్ధమనుల కాఠిన్యతగా (Atherosclerosis) భావించాలి. ధమనీ కాఠిన్యత (arteriosclerosis) శైశవము నుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత ప్రస్ఫుటమయి వృద్ధాప్యములో తీవ్రతరము అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొర (intima) క్రింద కొవ్వులు, కొలెష్టరాలు, కాల్సియం, తాపకణములు (inflammatory cells) పేరుకొని ఫలకలుగా (plaques) పొడచూపుతాయి. మృదుకండరముల మధ్య కాల్సియమ్ ఫాస్ఫేట్ నిక్షేపములు కూడుకున్నపుడు హృద్ధమనులు బిఱుసెక్కుతాయి. ధమనీ కాఠిన్యపు ఫలకలు ధమనుల లోనికి ఉబుకుట వలన ధమనుల లోపలి పరిమాణము తగ్గి అవి సంకుచితము అవుతాయి. ఈ ఫలకలు హృద్ధమనులలో ఒకటి రెండు చోట్లే ఉండవచ్చు, లేక ఎక్కువగా ఉండవచ్చును. ధమనులలో హెచ్చుభాగము కాఠిన్యత పొంద వచ్చును. హృద్ధమనులు, వాటి శాఖలలో నాళాంతర పరిమాణము 40 శాతము కంటె తక్కువగా  తగ్గినపుడు రక్తప్రవాహమునకు చెప్పుకోదగ్గ అవరోధము కలుగదు. రక్తనాళములలో ఫలకలు స్థిరముగ ఉండి నాళాంతర పరిమాణము 40-70 శాతము తగ్గినపుడు రక్తప్రవాహమునకు అవరోధము కలిగి శ్రమ, వ్యాయామములతో హృదయమునకు ప్రాణవాయువు అవసరాలు పెరిగినపుడు ఆ అవసరములు తీరక గుండెనొప్పి (Angina) కలుగుతుంది. రక్తప్రసరణ లోపము (ischemia) తీవ్రతరము అయినపుడు హృదయపు లయ తప్పే అవకాశము ఉన్నది. జఠరికల లయ తప్పి ప్రకంపన స్థితి (ventricular fibrillation) లోనికి వెళ్తే ప్రాణాపాయమునకు దారితీయవచ్చును. ఒక్కోసారి ఒక హృద్ధమని పూర్తిగా మూసుకుపోవచ్చును. ధమనిలో ఫలక ఏర్పడి ఆ ఫలక చిట్లి దానిపై రక్తము గడ్డకట్టి రక్తప్రసరణకు తీవ్ర అవరోధము కలిగితే, హృదయ కండరజాలములో కొంత భాగము ప్రాణ వాయువు, పోషకపదార్థములు అందక మరణిస్తే గుండెపోటు (myocardial infarction) కలుగుతుంది. మానుదల ప్రక్రియలో ఆ మరణించిన కణజాలమునకు బదులు పీచుకణజాలము ఏర్పడుతుంది. అపుడు హృదయ

84 ::