పుట:Hello Doctor Final Book.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎడమ దిశలో అడ్డముగా పయనించి గుండె వెనుక కుడి దిశలో పర జఠరికాంతర గర్తము (posterior inter ventricular sulcus) వఱకు పయనించి దక్షిణ హృద్ధమని శాఖతో కలుస్తుంది. 15 శాతము మందిలో పర అవరోహణ ధమని (posterior descending artery) ఏర్పడుటలో వామ పరిభ్రమణ ధమని ముఖ్యపాత్ర వహిస్తుంది. 85 శాతము మందిలో  పర అవరోహణ ధమని ఏర్పడుటకు దక్షిణ హృద్ధమని ముఖ్యపాత్ర వహిస్తుంది. వామ పరిభ్రమణ ధమని ఎడమ జఠరిక వెనుక భాగమునకు, పక్క భాగమునకు రక్తప్రసరణ సమకూరుస్తుంది.

పర అవరోహణ ధమని (posterior descending artery) కుడి జఠరిక ఎడమ జఠరికల మధ్య ఉన్న గోడలో (జఠరికాంతర కుడ్యము; inter ventricular septum) వెనుక మూడవవంతు భాగమునకు, జఠరికల క్రిందిభాగములకు రక్తప్రసరణ  సమకూరుస్తుంది. దక్షిణ హృద్ధ మని (Right coronary artery ) :

దక్షిణ హృద్ధమని బృహద్ధమని (aorta)  నుంచి కుడి కవాట పత్రము మీద మొదలవుతుంది. ఇది కుడి కర్ణిక కుడిజఠికల మధ్య ఉన్న గర్తములో పర జఠరికాంతర గర్తము (posterior inter ventricular sulcus) వఱకు పయనిస్తుంది. ఇది కుడి మేరధమని (right marginal artery), పర అవరోహణ ధమని (posterior descending artery) అను శాఖలుగా చీలుతుంది. దక్షిణ హృద్ధమని కుడి జఠరికకు, ఎడమ జఠరికలో 25-35 శాతపు భాగమునకు రక్తప్రసరణ సమకూరుస్తుంది. ధమనుల గోడలలో బయటపొర (tunica externa or adventitia), మధ్యపొర (tunica media), లోపొర (tunica interna or intima) అనే మూడు పొరలు ఉంటాయి. బయటపొరలో సాగుకణజాలము (elastic tissue), పీచుకణజాలము (fibrous tissue) ఉంటాయి. మధ్యపొరలో మృదుకండరములు  (smooth muscles), సాగుకణజాలము (elastic tissue), పీచుపదార్థము (collagen) ఉంటాయి. నాళముల లోపొర పూతకణములు (lining cells), సాగుపదార్థము (elastin),

83 ::