పుట:Hello Doctor Final Book.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వామ హృద్ధ మని ( Left Coronary artery ) :

ఎడమ లేక వామ హృద్ధమని  బృహద్ధమని (aorta) నుంచి ఎడమ బృహద్ధమని కవాటము పైన మొదలవుతుంది. ఇది  వామ పరిభ్రమణ ధమని (left circumflex artery), వామ పూర్వ అవరోహణ ధమని (left anterior descending artery) అని రెండు శాఖలుగా చీలుతుంది. కొంతమందిలో మధ్యస్థ ధమని (intermediate artery) అనే మూడవ శాఖ కూడా ఉంటుంది. వామ పూర్వఅవరోహణ ధమని రెండు జఠరికల మధ్య ముందు భాగములో ఉన్న గాడిలో (పూర్వ జఠరికాంతర గర్తము; anterior inter ventricular sulcus) క్రిందకు పయనిస్తుంది. దీని కుడ్య శాఖలు (septal branches) రెండు జఠరికల మధ్య ఉన్న గోడ (జఠరికాంతర కుడ్యము; inter ventricular septum) ముందు రెండు భాగములకు రక్తప్రసరణ సమకూరుస్తాయి. ఈ వామ పూర్వ అవరోహణ ధమని (left anterior descending artery) నుంచి వచ్చే వక్ర శాఖలు (diagonal branches) ఎడమ జఠరిక పార్శ్వభాగమునకు రక్తప్రసరణ సమకూరుస్తాయి. వామపూర్వ అవరోహణధమని గుండె ఎడమ జఠరికకు సుమారు 50 శాతపు రక్తప్రసరణను సమకూరుస్తుంది.

వామ పరిభ్రమణ ధమని (left circumflex artery) ముందు

82 ::