పుట:Hello Doctor Final Book.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్వాసకోశవ్యాధులు ( Pulmonary diseases) :

శ్వాసనాళ శాఖలలోను, వాటి చివరల ఉండే పుపుస గోళములలోను (Alveoli) సాగుదల ఉంటుంది. ఆ సాగుదల (Elasticity) వలన ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు బాగా జరిగి గాలి కదలికలు సరిగ్గా జరుగుతాయి. పొగత్రాగేవారిలో సాగు కణజాలము (Elastic tissue) చెడి ఆ సాగుదల దెబ్బతింటుంది. అందువలన గాలి కదలికలకు అవరోధము కలుగుతుంది. సాగుదల త్రగ్గుటవలన ఊపిరితిత్తులు వ్యాకోచము (ఊపిరితిత్తుల ఉబ్బు; emphysema) చెందుతాయి. శ్వాసనాళికల పూతకణములకు ఉండే కదలాడే సూక్ష్మకేశములు (cilia) కూడా పొగత్రాగేవారిలో పనిచెయ్యవు. అందుచే  శ్లేష్మస్రావకములు ( mucous secretions) తొలగించబడవు. వీరిలో తఱచు సూక్ష్మజీవులవలన వ్యాధులు కలుగుతాయి. వీరికి శ్వాస సరిగా ఆడక ఆయాసము, దగ్గు వస్తుంటాయి. వాయువుల మార్పిడి తగ్గుట వలన రక్తములో బొగ్గుపులుసు వాయువు ( Carbon dioxide) పరిమాణము పెరుగుట, ప్రాణవాయువు (Oxygen) పరిమాణము తగ్గుట కూడా కలుగ వచ్చును. శ్వాస అవరోధవ్యాధిని (Obstructive pulmonary disease) చాలామంది ధూమ పానీయులలో  వైద్యులు నిత్యము చూస్తారు. క్షయ వ్యాధి :

ధూమపానము సలిపేవారికి క్షయవ్యాధి సోకే అవకాశములు కూడా పెరుగుతాయి. పొగత్రాగే వారికి క్షయవ్యాధి సోకితే వారిలో  ఔషధములుకు వ్యాధి ప్రతిఘటన ఎక్కువయి చికిత్స క్లిష్టతరము అవుతుంది. హృద్రోగములు, రక ్తనాళపు వ్యాధులు:

రక్తనాళములలో ధమనుల గోడలమధ్య  వయస్సు పెరుగుతున్నకొలది

కొలెష్ట్రాలు (Cholesterol), ఇతర కొవ్వులు చేరి మార్పులు జరిగి ధమనీ కాఠిన్యత (Atherosclerosis) కలుగుతుంది. పొగత్రాగేవారిలో అల్ప సాంద్రపు కొలెష్ట్రాలు (LDL) పెరుగుటయే కాక, ఆ కొలెష్ట్రాలు రక్తనాళాలలో చేరి ధమనీ కాఠిన్యతను వేగపరుస్తుంది. ధమనులు కాఠిన్యత పొందినప్పుడు

78 ::