పుట:Hello Doctor Final Book.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కండరముల తీవ్ర నీరసవ్యాధి అధికశాతము మందిలో కలిగే అవకాశములు ఉన్నాయి. గళగ్రంథి స్రావక ఆధిక్యతకు కారణములు

గళగ్రంథి ప్రమాణము వివిధ కారణముల వలన పెరిగి కంఠము ముందు గళగండముగా (Goiter) పొడచూపవచ్చును. గళగ్రంథి  అంతటా సమముగా పెరుగుతే దానిని సమ గళగండము లేక సదృశ గళగండముగా (Diffuse goiter) పరిగణించవచ్చును.

అసమానముగా కణుతులు పెరిగి బహుళ కిణ గళగండములు (Multinodular goiters) కొందఱిలో పొడచూపుతాయి. నిరపాయపు పెరుగుదలలు (Adenomas) కొందఱిలో కలిగి ఒక కర్ణికలోనే గళగండము పొడచూప వచ్చును. వీరిలో పరిమాణపు పెరుగుదలతో బాటు స్రావకముల ఉత్పత్తి అధికమయినపుడు గళగ్రంథి ఆధిక్యత లక్షణములు కలుగుతాయి.

గళగ్రంథి తాపముల (Thyroiditis) వలన తాత్కాలికముగా గళగ్రంథి స్రావకముల ఉత్పత్తి పెరుగవచ్చును. అయొడిన్ వినియోగము ఎక్కువైనా, గళగ్రంథి స్రావకముల వినియోగము ఎక్కువయినా (Iatrogenic) గళగ్రంధిస్రావక ఆధిక్యత కలుగగలదు. ఎమియోడరోన్

69 ::