పుట:Hello Doctor Final Book.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(Atrial fibrillation), హృదయ వైఫల్యములు కలుగవచ్చును (Congestive heart failure). చర్మపు మందము తగ్గుతుంది. పెళసరి వెండ్రుకలు, కేశనష్టము, కనుబొమలు సన్నబడుట, జ్ఞాపకశక్తి తగ్గుట, ఎముకలు బలహీనమగుట (గుల్ల ఎముకలవ్యాధి - Osteoporosis) మరికొన్ని లక్షణములు. మతిభ్రమణము అరుదుగా కొందఱిలో కలుగుతుంది. చేతుల వణుకుతో బాటు కొందఱిలో అనిచ్ఛా చలనములు (Chorea) కూడా పొడచూపవచ్చును.

నేత్రగోళ కండరములు నీరసించి రెండు నేత్రముల చలనములలో సహకారము (coordination) లోపించుట వలన ఒక వస్తువు రెండుగా (Diplopia; ద్విదృష్టి) కనిపించవచ్చును. పై కనురెప్పలు వెనుకకు ఎక్కువగా పోయి (Lid retraction) కళ్ళ మీది తెలుపు (శ్వేతపటలము Sclera) గోచరమవుతుంది. క్రింది వస్తువులపై దృష్టి సారించినపుడు కనుగుడ్లతో సమముగా కనురెప్పలు క్రిందకు కదలక (Lid lag) కళ్ళమీది తెల్ల భాగము తాత్కాలికముగా ఎక్కువగా కనిపించవచ్చును. గళగ్రంథి ఆధిక్యత పరిమితముగా ఉన్నపుడు కొందఱిలో ఏ లక్షణములు కనిపించక పోవచ్చును.

అరుదుగా శరీరము సూక్ష్మాంగజీవుల ముట్టడికి గుఱైనపుడు, శస్త్రచికిత్సల పిదప, శరీరము ప్రమాదములకు గుఱి అయినపుడు, గళగ్రంథి స్రావకములను నిరోధించు మందులు ఉపసంహరించినపుడు గళగ్రంథి సంక్షోభము (Thyroid storm) కలిగి, అధికఉష్ణోగ్రత, మానసిక సంభ్రమము, గందరగోళము, సన్నిపాతము (Delirium) కలిగి మృత్యువునకు దారి తీయవచ్చును. వీరికి అత్యవసర చికిత్స అవసరము. గ్రేవ్స్ సదృశగళగండ స్రావక ఉద్రేకత (Diffuse toxic goiter from Grave’s disease) కలిగిన వారిలో గళగండస్రావక ఆధిక్యతతో (Hyperthyroidism)బాటు వెలిగుడ్లు (Exopthalmos), నేత్ర కండరముల నీరసము (extraocular muscle weakness), జంఘికాస్ల థు ముందు ఉబ్బుదల (pretibial myxedema) కూడా కలుగుతాయి.

గళగ్రంథి ఆధిక్యత కలిగిన వారిలో Myasthenia gravis అనే

68 ::