పుట:Hello Doctor Final Book.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూపుతాయి. పరిమిత లోపము ఉన్న వారిలో యే లక్షణములు కనిపించక పోవచ్చును. రక్తపరీక్షలు విరివిగా లభ్యము అవుతున్న ఈ దినములలో మిక్సిడీమా, లక్షణాలు బాగా కనిపించే గళగ్రంథి హీనతలను అఱుదుగా చూస్తాము. రక ్త పరీక్షలు :

గళగ్రంథి హీనత ఉన్నవారిలో కొలెష్ట్రాలు, ట్రైగ్లిసరైడులు, క్రెయటినిన్ కైనేజ్ ల పరిమాణములు ఎక్కువగా ఉండవచ్చును. వీరిలో సోడియం ప్రమాణములు తక్కువ అవవచ్చును. రక్త ము లో గళగ్రంథి ప్రేరేపకపు విలువలు (TSH) ఎక్కువగా ఉంటాయి. గళగ్రంథి ప్రేరేపకపు (TSH) విలువలు సాధారణ ప్రమాణములో ఉండి, థైరాక్సిన్ (T4) విలువలు తక్కువగాని పక్షములో గళగ్రంథి హీనత లేదని నిర్ధారణ చెయ్యవచ్చును. గళగ్రంథి ప్రేరేపకపు (TSH) విలువ 20 మైక్రోయూనిట్లు / మి. లీ.రుకి మించి ఉంటే వ్యాధి లక్షణాలు లేకపోయినా గళగ్రంథి హీనత ఉన్నదని నిర్ధారణ చెయ్యవచ్చును.

గళగ్రంథి హీనత లేక యితర వ్యాధులు ఉన్నవారిలో గళగ్రంథి ప్రేరేపకపు విలువ సాధారణ పరిమితిని అతిక్రమించినా 20 మైక్రో యూనిట్ల లోపునే ఉంటుంది. గళగ్రంథి ప్రేరేపకపు (TSH) విలువ ఎక్కువయినా 20 మైక్రో యూనిట్ల లోనే ఉండి థైరాక్సిన్ (T4) విలువ తక్కువగా ఉంటే దానిని విదిత గళగ్రంథి హీనతగా (Overt hypothyroidism) పరిగణించి వారికి తగు పరిమాణములో లీవోథైరాక్సిన్ సమకూర్చాలి.

గళగ్రంథి ప్రేరేపకపు (TSH) విలువలు 5- 10 (కొందఱు వైద్యులు 5 దాటినప్పుడు, కొందఱు 10 దాటినప్పుడు) ప్లాస్మా థైరాక్సిన్ (T4) విలువలు సాధారణ పరిమితులలో ఉన్నప్పుడు దానిని అగోచర గళగ్రంథి హీనతగా (Subclinical hypothyroidism) పరిగణిస్తారు. వీరికి వైద్యము అవసరము లేదు, కాని సంవత్సరమునకు ఒక పర్యాయము రక్తపరీక్షలు చేసి గమనిస్తూ థైరాక్సిన్ (T4) విలువలు తగ్గినా, గళగ్రంథి

64 ::