పుట:Hello Doctor Final Book.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రేరేపకపు విలువలు పెరిగినా లీవోథైరాక్సిన్ వైద్యము సమకూర్చవచ్చును. అగోచర గళగ్రంథిహీనత ఉన్నవారిలో సంవత్సరమునకు 2.5% మందిలో యీ హీనత ప్రస్ఫుటమవుతుంటుంది.

గర్భిణీస్త్రీలలో గళగ్రంథి ప్రేరేపకపు విలువలు 10 మైక్రోయూనిట్లు దాటితే అది విదిత గళగ్రంథి హీనముగా పరిగణించి వైద్యము చెయ్యాలి. ఆ విధముగా శిశువులలో వ్యాధిని అరికట్టవచ్చును. అప్రధాన గళగ్రంథి (Secondary hypothyroidism) హీనత ఉన్న వారిలో గళగ్రంథి ప్రేరేపకపు (TSH) విలువలు హెచ్చు కావు. కావున వీరిలో గళగ్రంథి స్రావకముల విలువలు (థైరాక్సిన్- T4 , స్వేచ్ఛపు థైరాక్సిన్ -Free T4) తక్కువగా ఉంటే గళగ్రంథి హీనతను ధ్రువీకరించవచ్చును. గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములకు (TSH Receptors), థైరోగ్లాబ్యులిన్ కు, థైరాయిడ్ పెరాక్సిడేజ్ కు ప్రతిరక్షకముల (Antibodies) పరీక్షతో స్వయంప్రహరణ గళగ్రంథి తాపమును (Autoimmune thyroiditis)ధ్రువీకరించ వచ్చును. కాని చికిత్సాపరముగా యీ పరీక్షల వలన చేకూరే ప్రయోజనము తక్కువ.

గళగ్రంథిలో గడ్డలు, పెరుగుదలలు ఉంటే శ్రవణాతీతధ్వని చిత్రీకరణ (Ultrasonography)పరీక్షలు, కణపరీక్షలు అవసరము కావచ్చును. పెరుగుదలలు లేకపోతే ఆ పరీక్షలు అనవసరము. పీనసగ్రంథి, హైపోథలమస్, మెదడు వ్యాధుల లక్షణాలు ఉంటే అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణలు (Magnetic resonance imaging) తోడ్పడుతాయి. చికిత్స :

లీవోథైరాక్సిన్ (Levothyroxine) కృత్రిమముగా తయారు చేస్తున్నారు. తక్కువ ధరకు అందుబాటులో కూడా ఉంది. గళగ్రంథి హీనత ఏ కారణము వలన కలిగినా లీవోథైరాక్సినే చికిత్సకు వాడుతారు. తగిన మోతాదును వైద్యులు నిర్ణయిస్తారు. యౌవనములో ఉన్నవారికి తగిన మోతాదును ఒక్కసారే

65 ::