పుట:Hello Doctor Final Book.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలగించినా, రేడియోధార్మిక అయొడిన్ తో ధ్వంసము చేసినా గళగ్రంథి హీనత కలుగుతుంది.

అయొడిన్ గల ఔషధములు, లిథియం, ఆల్ఫా ఇంటెర్ఫెరాన్, ఇంటెర్లూకెన్-2, ఎమియోడరోన్, థాలిడోమైడు వంటి మందులవలన గళగ్రంథి హీనత కలుగవచ్చును. అప్రధాన గళగ్రంథిహీనత ( Secondary Hypothyroidism) :

పీనస గ్రంథి వ్యాధి (Pituitary disorders), లేక ఘాతముల (injuries) వలన గళగ్రంథి ప్రేరేపకపు (TSH) ఉత్పత్తి జరుగక, ప్రేరేపక లోపము (TSH deficiency) వలన, గళగ్రంథి స్రావకముల (T3,T4) ఉత్పత్తి తగ్గుతే గళగ్రంథి హీనత కలుగుతుంది. తృతీయ గళగ్రంథి హీనత (Tertiary hypothyroidism) :

మెదడులోని హైపోథలమస్ (Hypothalamus) గళగ్రంథి ప్రేరేపక విమోచిని ని (Thyrotropin releasing hormone) విడుదల చేయలేని స్థితులలో తృతీయ గళగ్రంథి హీనత కలుగుతుంది.

ద్వితీయ, తృతీయ గళగ్రంథి హీనములు అసాధారణము. వారిలో మెదడు, పీనస వ్యాధుల లక్షణాలు ప్రస్ఫుటముగా కనిపిస్తాయి. గళగ్రంథి హీనత లక్షణములు

గళగ్రంథి హీనత ప్రస్ఫుటముగా ఉన్నవారిలో, అలసట, అతినిద్ర, నీరసము, శక్తిహీనత, చలికి తట్టుకోలేకపోవుట, మలబద్ధకము, జ్ఞాపకశక్తి క్షీణించుట, బొంగురుగొంతు, కండరాల సలుపు, కేశనష్ట ము , స్త్రీలలో రక్త ప్ర దరము (metrorrhagia) పొడచూపవచ్చును. ఈ లక్షణములు క్రమేణా కలుగుతాయి. కొందఱిలో ఏ బాధలు ఉండవు. వీరిలో పొడిచర్మము, ముఖములోను, కళ్ళచుట్టూ వాపు, హృదయ మాంద్యము (Bradycardia), స్నాయువుల ప్రతిక్రియలు మందగించుట (Decreased tendon reflexes), గుంతపడని పొంగులు, కఱకు చర్మము, కనిపించ వచ్చును. శరీరపు బరువు కొంత హెచ్చినా విశేష స్థూలకాయమును

62 ::