పుట:Hello Doctor Final Book.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గళగ్రంథి హీనత ( Hypothyroidism ):

ప్రధాన గళగ్రంథి హీనత ( Primary hypothyroidism ) :

గళగ్రంథి శరీర అవసరాలకు తగినంత స్రవములను అందించ లేనప్పుడు గళగ్రంథి హీనత (Hypothyroidism) కలుగుతుంది. హెచ్చు శాతము మందిలో యీ లోపము గళగ్రంథులలోనే ఉంటుంది. గళగ్రంథి తగినంతగా నిర్నాళ రసములను (Hormones) ఉత్పత్తి చేయకపోవుట వలన యీ లోపము కలుగుతుంది. గళగ్రంథుల లోపమే ప్రాథమిక కారణమయితే దానిని ప్రాథమిక గళగ్రంథి హీనతగా (Primary Hypothyroidism) పరిగణిస్తారు. శరీరములో అయొడిన్ లోపము వలన ప్రపంచములో హెచ్చుమందికీ గళగ్రంథి హీనత కలుగుతుంది. పాశ్చాత్య దేశాలలో ఉప్పుకు అయొడిన్ ను సంధానపఱచుట వలన ప్రజలలో అయొడిన్ లోపము అఱుదు. హషిమోటో గళగ్రంథి తాపము ( Hashimoto ‘s thyroiditis ) :

గళగ్రంథి స్వయం ప్రహరణ వ్యాధి (Autoimmune thyroiditis) వలన గళగ్రంథి ధ్వంసము చెంది గళగ్రంథి హీనత కలుగవచ్చు. ఈ వ్యాథిలో టి- రసికణములు (T Lymphocytes; ఇవి శరీర రక్షణ వ్యవస్థలో ఒక భాగము.) గ్రంథులను ఆక్రమిస్తాయి. థైరోగ్లాబ్యులిన్ (గళగ్రంథులలో ఉండే మాంసకృత్తి. దీని నుంచి గళగ్రంథి స్రావకములు ఉత్పత్తి అవుతాయి), థైరాయిడ్ పెరాక్సిడేజ్ (Thyroid peroxidase), గళగ్రంథిప్రేరేపక గ్రాహములకు (TSH receptors) ప్రతిరక్షకములు (Antibodies) ఏర్పడి గ్రంథుల ధ్వంసమునకు దారితీస్తాయి. ఈ తాపక్రియ (Inflammation) మందకొడిగా జరిగి క్రమేణా గళగ్రంథి హీనతను (Hypothyroidism) కలుగజేస్తుంది.

ప్రసవము తర్వాత కొంతమంది స్త్రీలలో తాత్కాలికముగా గళగ్రంథి హీనత పొడసూపవచ్చును. కొద్దిమందిలో యీ లోపము శాశ్వతము కావచ్చును. చికిత్సా జనితము ( Iatrogenic ) :

గళగ్రంథిని శస్త్రచికిత్సతో సంపూర్ణముగా గాని, పాక్షికముగా గాని

61 ::