పుట:Hello Doctor Final Book.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గళగ్రంథి స్రావకముల నియంత్రణ :

గళగ్రంథి స్రావకముల ఉత్పత్తిని, రక్తములో వాటి విడుదలను పీనస గ్రంధి (Pituitary gland) నుంచి విడుదల అయే గళగ్రంథి ప్రేరేపకము (Thyroid stimulating hormone; Thyrotropin) నియంత్రిస్తుంది. గళగ్రంథి ప్రేరేపకపు (TSH) విడుదలను మెదడు క్రిందిభాగములో ఉండే హైపోథలమస్ (Hypothalamus) గళగ్రంథి ప్రేరేపక విమోచిని (Thyro tropin releasing hormone) ద్వారా నియంత్రిస్తుంది. రక్తములో గళగ్రంథి స్రావకముల (Thyroid hormones) ప్రమాణము పెరిగినప్పుడు, పీనసగ్రంథి (Pituitary gland) నుంచి గళగ్రంథిప్రేరేపకపు (TSH) విడుదల తగ్గుతుంది. గళగ్రంథి స్రావకముల (T3, T4) ప్రమాణము తగ్గి న పుడు గళగ్రంథి ప్రేరేపకపు (TSH) విడుదల హెచ్చవుతుంది. ఆ

59 ::