పుట:Hello Doctor Final Book.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తగ్గించి ధమనులను వ్యాకోచింపజేసి, రక్త పీ డనమును తగ్గి స్తా యి. ఇవి హృదయమునకు  రక్తప్రసరణ పెంచుతాయి. హృద్ధమనుల ప్రసరణ లోపములు (Ischemia), అధిక రక్త పీ డనము కలవారిలోను, ఇతర ఔషధములతో రక్తపీడనము లొంగనివారిలోను వీటి ప్రయోజనము కలదు. వీనిలో డైహైడ్రోపైరిడిన్ (dihydropyridines) తరగతికి చెందని వెరాపమిల్ (Verapamil), డిల్టియజెమ్ (Diltiazem) హృదయ మాంద్యమును (bradycardia) కలిగించగలవు. హృదయ కండరముల సంకోచమును (contractility) తగ్గించగలవు. అందుచే హృదయ మాంద్యము, ప్రేరణ ప్రసరణ లోపములు (Impulse conduction defects) కలవారిలోను, హృదయ వైఫల్యము (Congestive heart failure) కలవారిలోను వీటి వాడుకలో జాగ్రత్త అవసరము. డైహైడ్రోపైరిడిన్ తరగతికి చెందిన ఏమ్లోడైపిన్ (amlodipine), ఫెలోడైపిన్ (felodipine) వంటి మందులు హృదయ మాంద్యమును కలిగించవు, హృదయ సంకోచమును అంతగా తగ్గించవు. కాని వీటి వలన పాదములలో పొంగు కలుగవచ్చును. నారంగకాలేయ వ్యాధిగ్రస్థులలో (cirrhosis of liver) కాల్సియం మార్గ అవరోధకముల మోతాదులు తగ్గించవలసి ఉంటుంది. మస్తిష్క కేంద్ర ఔషధములు (Centrally acting adrenergic agents) :

క్లానిడిన్ (Clonidine) ఈ కోవకు చెందిన మందు. ఇది మస్తిష్క మూలములో ఆల్ఫా-2 గ్రాహకములను ఉత్తేజపఱచి కాటిఖాలమైన్ల (catecholamines) విడుదలను తగ్గించి రక్తనాళముల బిగుతును తగ్గించి రక్తపీడనమును తగ్గిస్తుంది. దీని వలన హృదయ మాంద్యము (bradycardia), మత్తుదల (drowsiness), నోరు పిడచకట్టుకొనుట వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. సత్వర ఉపసంహరణము (acute withdrawal) వలన రక్తపీడనము బాగా పెరుగుట, గుండెవేగము పెరుగుట, ఒళ్ళు చెమర్చుట వంటి లక్షణములు కనిపిస్తాయి. ప్రత్యక్ష రక ్తనాళ వ్యాకోచకములు (Direct vasodilators) :

ఈ ఔషధములు ప్రత్యక్షముగా రక్తనాళములపై పనిచేసి వాటి బిగుతును

47 ::