పుట:Hello Doctor Final Book.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వైద్యులు గమనిస్తూ ఉండాలి. రక్తద్రవపు పొటాసియం (serum potassium) పరిమితులు దాటకుండా గమనించాలి. 0.7 శాతము మందిలో చర్మము క్రింద గాని, శ్లేష్మపు పొరల (mucous membranes) క్రిందగాని పెదాలు, నాలుక, కనుల క్రింద కణజాలములో అసహనపు పొంగు (Angioedema) కలిగే అవకాశము ఉంది. వారిలో  ACE inhibitors ను ఆపివేయాలి. ఇవి కొందఱిలో దగ్గు కలుగజేస్తాయి. దగ్గు తీవ్రముగా ఉన్నవారిలో కూడ ఈ ఔషధములకు ప్రత్యమ్నాయములను వాడుకోవాలి. ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములు (Angiotensin Receptor Blockers)

ఇవి ఏంజియొటెన్సిన్ 2 గ్రాహకములను  అడ్డుకొనుట వలన ఏంజియో టెన్సిన్ 2 నిర్వీర్యమయి ధమనికల బిగుతు తగ్గుతుంది. రక్తపుపోటు తగ్గుతుంది. ఆల్డోస్టెరోన్ ఉత్పత్తిని కూడా ఇవి తగ్గిస్తాయి. ACE inhibitors సహించని వారిలో వీటిని ప్రయత్నించవచ్చును. వీటిని వాడేటపుడు కూడా తఱచు రక్తపరీక్షలతో మూత్రాంగ వ్యాపారమును, పొటాసియమ్ విలువలను పరిశీలిస్తూ ఉండాలి. ఆల్ఫా ఎడ్రినెర్జిక్ గ్రాహక అవరోధకములు (Alpha adrenergic receptor blockers)

ఇవి ఆల్ఫా అడ్రినల్ గ్రాహకములను  నిరోధించి రక్తనాళములపై అడ్రినల్ హార్మోనుల ప్రభావమును తగ్గిస్తాయి. ధమనికల బిగుతును తగ్గిస్తాయి. ప్రాజొసిన్ (Prazosin), టెరజోసిన్ (Terazosin), డోక్సొజొసిన్ (doxazosin) ఈ తరగతికి చెందిన ఔషధములు. రక్తపీడనమును తగ్గించుటలో మిగిలిన తరగతులకు చెందిన ఔషధములు వీనికంటె మెరుగైనవి. ఇవి తొలిదినము రక్తపీడనమును తగ్గించినట్లు తరువాత తగ్గించవు. కళ్ళు తిరుగుట, నిట్టనిలువు స్థితిలో రక్తపీడనము తగ్గుట (orthostatic hypotension), తలనొప్పి వంటి అవాంఛిత ఫలితములు ముందు కలిగినా అవి క్రమేణా తగ్గుతాయి. కాల్సియమ్ మార్గ   అవరోధకములు (Calcium channel blockers)   

ఈ ఔషధములు కణముల కాల్సియం మార్గములను బంధించి కాల్సియం గమనమును అరికట్టి రక్తనాళములలో మృదుకండరముల సంకోచమును

46 ::