పుట:Hello Doctor Final Book.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తగ్గించి రక్తపీడనము తగ్గిస్తాయి. మిగిలిన ఔషధములకు తగని ్గ రక్తపు పోటునకు వీటిని వాడుతారు.

హైడ్రాలజిన్ ను (Hydralazine) గర్భిణీ స్త్రీలలో రక్తపీడనము అదుపులో పెట్టుటకు కూడా ఉపయోగిస్తారు. హైడ్రాలజిన్ వలన గుండెవేగము హెచ్చి హృద్ధమని వ్యాధిగ్రస్థులలో గుండెనొప్పి, గుండెపోటులు కలుగగలవు. ఇది రెనిన్ విలువలు పెంచి శరీర ద్రవపరిమాణమును పెంచగలదు. ఈ అవాంఛిత ఫలితములను అరికట్టుటకు దీనిని బీటా గ్రాహక అవరోధకములతోను (beta adrenergic receptor blockers), మూత్ర కారకములతోను (diuretics) కలిపి వాడుతారు. లూపస్ వంటి వ్యాధి దీని వలన కలిగితే ఈ మందును ఆపివేయాలి. దీని వలన తలనొప్పి, వాంతులు, గుండెవేగము పెరుగుట, నిట్టనిలువు స్థితిలో రక్తపీడనము తగ్గుట (postural hypotension) వంటి అవాంఛిత ఫలితములు కొందఱిలో కలుగుతాయి.

మినాక్సిడిల్ (Minoxidil) వాడే వారిలో బరువు హెచ్చుట, రోమములు ఎక్కువగా పెరుగుట (hypertrichosis), హృత్కోశములో నీరుపట్టుట (pericardial effusion) వంటి అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. ఇంకా పలురకాల మందులు అధికపీడన నివారణకు ఉన్నాయి.

ఏ ఔషధమైనా అనుకూల ఫలితాలనే గాక ప్రతికూల ఫలితాలను కూడా కలిగించవచ్చును. కాబట్టి వైద్యులు వాటిని గమనిస్తూ ఉండాలి. మూత్ర కారకములను వాడేటపుడు, పొటాసియము విలువలను మధ్య మధ్య పరీక్షించాలి. రక్తపుపోటును అదుపులో ఉంచుటకు కొందఱికి అనేక ఔషధాల అవసరము కలుగవచ్చును. రక్తపుపోటు ఎక్కువగా ఉన్నపుడు ఎట్టి నలత చూపించకపోయినా, అవయవాలపై దీర్ఘకాలిక దుష్ఫలితాలను కలిగిస్తుంది. అధికపీడన సంక్షోభము సంభవిస్తే గుండెపోటు, మస్తిష్క విఘాతము, దృష్టిలోపము, మూత్రాంగవైఫల్యము, హృదయవైఫల్యము వంటి విషమ సంఘటనలు కలుగవచ్చును. అందువలన వీలు కలిగించుకొని, అప్పుడప్పుడు రక్తపీడనము పరీక్షించుకోవాలి. వైద్యులను సంప్రదించి వారి

48 ::