పుట:Hello Doctor Final Book.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

Exophthalmos = వెలిగుడ్లు ( గ.న )

External Carotid Artery = బాహ్య కంఠధమని ( గ.న )

External Ileac Artery = బాహ్య శ్రోణిధమని

External Ileac Vein = బాహ్య శ్రోణిసిర ( గ.న )

Extrinsic Factor = బాహ్యాంశము ( విటమిన్ B12 ) ( గ.న )

Eye Patch = కనుకప్పు ( గ.న )

Facial ( Nerve ) Canal = ముఖనాడి అస్థినాళము ( గ.న ) Facial Muscles = ముఖకండరములు

Facial Nerve = ముఖనాడి

Facial Paralysis = ముఖపక్షవాతము ( గ.న )

False Positive Results = తప్పుడు అనుకూల ఫలితములు (గ.న)

Fascia = కండరాచ్ఛాదనము (గ.న)

Fatty Acids = వసామ్లములు ; కొవ్వు ఆమ్లములు

Fatty Liver Disease = కాలేయపుకొవ్వు (వస) వ్యాధి ( గ.న )

Fecal-Oral Route = పురీష వదన మార్గము (గ.న)

Feed Back = ప్రతివర్తమానము ( గ.న )

Femoral Artery = ఊరుధమని ( గ.న )(ఊరువు = తొడ ) Femoral Vein = ఊరుసిర

Fibrin = తాంతవము

Fibrinogen = తాంతవజని

Fibroblasts = తంతుకణములు ; పీచుకణములు ( గ.న )

Fibrosis = తంతీకరణము

Fibrous Tissue = పీచుకణజాలము ( గ.న ) , తంతుకణజాలము

Fluid Overload = ద్రవభారము ( గ.న )

Foam Cells = ఫేనకణములు (గ.న )

446 ::