పుట:Hello Doctor Final Book.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సోడియంని పెంచుతుంది.

సహవేదన నాడీమండలము, ఎడ్రినల్ గ్రంథుల నుంచి విడుదల అయే ఎడ్రినలిన్, నారడ్రినలిన్ హార్మోనులు (Catecholamines) కూడా రక్తనాళపు మృదుకండరాలను నియంత్రిస్తాయి. ఇవి గుండె వేగమును, గుండె సంకోచ ప్రక్రియను (contractility) ఇనుమడింప జేస్తాయి. పై ప్రక్రియల ప్రభావము ఎక్కువయి నప్పుడు రక్తపీడనము పెరిగి అధిక రక్తపీడనము కలుగుతుంది. రక ్తపుపోటు లక్షణములు :

చాలా మందిలో రక్తపుపోటు చాలాకాలము ఎట్టి లక్షణాలు, నలతలు చూపించదు. రక్తపీడనము కొలుచుట వలనే ఈ రుగ్మతను  కనిపెట్టగలము.

తలనొప్పి, కళ్ళు తిరగడము, ఒళ్ళు తూలిపోవడము వంటి  లక్షణములు కొందఱిలో కలుగవచ్చును. ఒంట్లో బాగానే ఉందని రక్తపుపోటుని నిర్లక్ష్యము చేయకూడదు. మధ్య మధ్యలో కొలుచు కోకుండా రక్తపుపోటు అదుపులోనే ఉన్నదని భ్రమించకూడదు. గుండె వ్యాధులు, మూత్రాంగముల వైఫల్యము (renal failure), మస్తిష్క విఘాతములు (cerebral strokes), దూర రక్తనాళ ప్రసరణ లోపములు (Peripheral Vascular insfficiency), అంధత్వము వంటి పరిణామముల వలనే రక్తపుపోటు కొంతమందిలో తొలిసారిగా కనుగొనబడవచ్చును. లక్షణాలు పొడచూపక పెక్కు అవయవాలపై చెడు ప్రభావము చూపిస్తుంది కాబట్టి మధ్య మధ్య రక్తపీడనము పరీక్షించుకోవలసిన అవసరము ఉన్నది. ఎక్కువగా ఉంటే చికిత్స అవసరము. పరీక్షలు :

రక్తపుపోటు ఉన్నదని నిర్ధారణ చేసాక కొన్ని పరీక్షలు అవసరము. రక్తకణ గణనములు (Complete Blood Counts), రక్త రసాయన పరీక్షలు (Blood Chemistry), మూత్రాంగముల వ్యాపార పరీక్షలు (Renal functions), మూత్రపరీక్షలు, అవసరమనిపిస్తే, హార్మోను పరీక్షలు, విద్యుత్

43 ::