పుట:Hello Doctor Final Book.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హృల్లేఖనము (electrocardiography) వంటి పరీక్షలు అవసరము. నేత్రబింబ పరీక్షలు (Fundoscopy) కూడా అవసరమే.

సంకోచ పీడనము (Systolic Pressure) 180 మి.మీ. మెర్క్యురీ పైన, వికాస పీడనము (Diastolic Pressure) 110 మి.మీ  మెర్కురీ దాటితే దానిని అధిక రక్తపీడన సంక్షోభముగా (Hypertensive Crisis) పరిగణిస్తారు. హృదయము, మెదడు, మూత్రాంగములు, కళ్ళపై దీని ప్రభావము కనిపిస్తే ఈ పీడన సంక్షోభాన్ని అత్యవసర పరిస్థి తి గా పరిగణించి చికిత్స చెయ్యాలి. సిరలద్వారా ఎక్కించే ఔషధాలు (Intravenous drugs) అవసరము అవవచ్చును. ఎట్టి విపత్తులు లేకపోతే  నోటి ద్వారా మందులు ఇచ్చి  చికిత్స చెయ్యవచ్చును. చికిత్స :

రక్తపుపోటు ఉన్నదని నిర్ధారణ చేసాక, యితరవ్యాధి లక్షణాలు లేవని రూఢీ చేసి, తగిన పరీక్షలు చేస్తూ, వ్యాధికి చికిత్స చెయ్యాలి. అధిక పీడనము సాధారణ పరిమితులకు దగఱ ్గ లో ఉన్నప్పుడు ఔషధముల అవసరము లేకుండా జీవనశైలి మార్పులతో దానిని అదుపులో పెట్టగలిగే అవకాశము ఉన్నది. అదుపులో ఉంచలేనపుడు, పీడనపు విలువలు అధికముగా ఉన్నప్పుడు మందులు వాడుక అవసరము. జీవన శైలి మార్పులు :

శరీరానికి తగినంత వ్యాయామము చాలా అవసరము. శ్రామికులు ఆరోగ్యవంతులుగాను దీర్ఘాయుష్కులుగాను ఉండుట గమనిస్తుంటాము. ఈ వాహనయుగములో ప్రజలకు నడక, వ్యాయామము తగ్గింది. తగినంత వ్యాయామము చేయుట, ఉప్పు, కొవ్వుపదార్థాల వాడుక తగ్గించుట, మితముగా భుజించుట, స్థూలకాయములను తగ్గించుట, పొగత్రాగుట మానుట, మద్య వినియోగమును మితములో ఉంచుకొనుట, మాదకద్రవ్యాల వినియోగములు మానుట రక్తపుపోటును అదుపులో ఉంచుటకు చాలా అవసరము.

44 ::