పుట:Hello Doctor Final Book.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అడ్రినల్ కార్టికో స్టీరాయిడ్ లు (adrenal corticosteroids) ఎక్కువ కావడము (Cushing Syndrome), ఆల్డోస్టీరోన్ (aldosterone) ఎక్కువ కావడము (Primary Hyperaldosteronism), సహగళగ్రంథి స్రావకము (Parathyroid hormone) ఎక్కువ అవడము వంటి వినాళగ్రంధుల వ్యాధులు, ఫియోఖ్రోమోసైటోమా,  మూత్రాంగముల వ్యాధులు (kidney diseases), మూత్రాంగ ధమనుల ఇరకటము (Renal artery stenosis) వలన కలిగే రక్తపుపోటులు అప్రధానపు రక్తపుపోటులు. అప్పుడు రక్తపు పోటును అదుపులో పెట్టుకొని అసలు వ్యాధులకు చికిత్స చెయ్యాలి. శస్త్రచికిత్సలు కూడా అవసరము కావచ్చును.

ఇతర కారణాలు లేకుండా కలిగే ప్రధాన అధికపీడనము జన్యు సంబంధమైనది కావచ్చును. ఉప్పు వాడుక ఎక్కువగుట, వ్యాయామ లోపము, మద్యము వినియోగము, మాదక ద్రవ్యాల వినియోగము, పొగ త్రాగుట, స్థూలకాయము రక్తపుపోటు కలుగుటకు తోడ్పడుతాయి. రక ్తపీడనము ఎలా కలుగుతుంది ?

    రక్తప్రసరణకు రక్తనాళముల నుండి కలిగే ప్రతిఘటన వలన రక్తపీడనము కలుగుతుంది. దేహములో రెనిన్, ఏంజియోటెన్సిన్ల వ్యవస్థ, సహవేదన నాడీమండలము (Sympathetic Nervous system) రక్త నా ళములలోని మృదుకండరాల (Smooth muscles) బిగుతును (Constriction) నియంత్రిస్తాయి.

మూత్రాంగములలో రెనిన్ ఉత్పత్తి చెంది రక్తములోనికి విడుదల అవుతుంది. ఈ రెనిన్ కాలేయములో ఉత్పత్తి అయే ఏంజియోటెన్సినోజన్ (Angiotensinogen) ని ఏంజియోటెన్సిన్-1 గా మారుస్తుంది.ఏంజియో టెన్సిన్-1 కణజాలములో ఉండే ఏంజియోటెన్సిన్ కన్వెర్ట ిం గ్ ఎంజైము వలన  ఏంజియోటెన్సిన్-2 గా  (angiotensin-2) మారుతుంది. ఏంజియో టెన్సిన్-2 రక్తనాళ కండరాలను సంకోచింపజేసి, రక్తనాళముల బిగుతును పెంచుతుంది. ఏంజియోటెన్సిన్-2 ఎడ్రినల్ గ్రంథుల నుంచి ఆల్డోస్టెరోన్ ని (aldosterone) కూడా విడుదల కావిస్తుంది. ఆల్డోస్టెరోన్ శరీరములో

42 ::