పుట:Hello Doctor Final Book.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హృదయ సంకోచ, వికాసముల వలన రక్తనాళములలో రక్తము పరంపరలుగా ప్రవహిస్తుంది. రక్తపీడనమును పాదరస మట్టముతో కొలుస్తారు. ధమనులలో ఉండే రక్తపీడనము గురించి చర్చిస్తాను.       వయోజనులలో ముకుళిత పీడనము (ఈ సంఖ్యను పైన సూచిస్తారు) 100 నుంచి 140 మిల్లీమీటర్ల పాదరస ప్రమాణములోను, వికాసపీడనము (ఈ సంఖ్యను క్రింద సూచిస్తారు) 60  నుంచి 90 మిల్లీమీటర్ల పాదరస ప్రమాణములోను ఉండుట సామాన్యముగా పరిగణించబడుతుంది. అధిక రక ్తపీడనము :

రక్తపీడనము నిలకడగా 140/90 మి.మీ. దాటి ఉంటే దానిని వైద్యులు అధిక రక్తపీడనముగ (రక్తపు పోటు; Hypertension) పరిగణిస్తారు. ఏదో ఒక్కక్క సారి ఆందోళన, భయము వంటి కారణముల వలన రక్త పీడనము కొంచెము హెచ్చినంత మాత్రమున దానిని రక్తపు పోటుగా పరిగణించరాదు. విశ్రాంతముగా కొద్దిసేపు కూర్చున్నాక రెండు, మూడు పర్యాయములు, లేక దినములో పెక్కు సార్లు పరిపాటిగా దినదిన కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నపుడు తీసుకొనే రక్తపీడనపు విలువలు (Ambulatory Pressures) బట్టి రక్తపు పోటుని నిర్ణయించాలి. రక్తపుపోటు  అదుపులో లేక ఎక్కువ కాలము ఉండుట వలన గుండెపోటు, గుండె బలహీనత, హృదయ వైఫల్యము (Congestive Heart failure), మస్తిష్క విఘాతాలు (Cerebro Vascular Accidents), మూత్రాంగముల వైఫల్యము (Renal failure), దృష్టి లోపములు వంటి విషమ పరిణామములు కలుగుతాయి. అందువలన రక్తపు పోటును అదుపులో పెట్టుకోవలసిన అవసరము ఉన్నది. అధిక సంఖ్యాకులలో అధికపీడనము (95 శాతమునకు మించి) ప్రధాన అధికపీడనము (Primary Hypertension). అంటే దానికి యితర కారణాలు ఉండవు. కొద్దిమందిలో  (సుమారు 5 శాతము మందిలో) అది యితర వ్యాధుల వలన కలుగుతుంది. అప్పుడు దానిని అప్రధాన అధికపీడనముగా (Secondary Hypertension) పరిగణిస్తారు. గళగ్రంథి స్రావకములు (Thyroid hormones) ఎక్కువ అవడము, తక్కువ అవడము,

41 ::