43. వై ద్యపదకోశము ( Alphabetically ) వై ద్యపదకోశము ( Alphabetically )
Abdominal Aorta = ఉదర బృహద్ధమని ( గ.న )
Abdominal Aortic Aneurysms = ఉదరబృహద్ధమని బుద్బుదము ( బుడగ ) ( గ.న ) Abdominal Cavity = ఉదరకుహరము Abscess = చీముతిత్తి (గ.న), చీముగడ్డ (గ.న)
Acid Reflux = ఆమ్లతిరోగమనము ( గ.న )
Acidophils, Eosinophils = ఆమ్లాకర్షణ కణములు ( గ.న ) Acidosis=ఆమ్లీకృతము (గ.న), ఆమ్లత్వము (గ.న)
Acute Coronary Syndrome = సత్వర హృద్ధమనివ్యాధులు (గ.న) Acute Kidney Injury = సత్వర మూత్రాంగవిఘాతము ( గ.న ) Afferent Arteriole = ప్రవేశధమనిక ( గ.న ) Airborne = వాయువాహనులు ( గ.న )
Air- Conditioner = వాయునియంత్రణులు (గ.న )
Alcohol Withdrawal = మద్యవర్జనము (గ.న) మద్యపరిత్యజనం ; Alcoholic Hepatitis = సుర కాలేయతాపము ( గ.న )
Alcoholic hepatic Steatosis = సుర కాలేయవసవ్యాధి ( గ.న ) Allergens = అసహనపదార్థములు ( గ.న ) Allergy = అసహనము ( గ.న )
Alopecia =కేశనష్టము (గ.న), బట్టతలమచ్చలు ( గ.న )
Alveolar Ducts = పుపుస గోళనాళికలు ( గ.న )
Alveolus = ఊపిరి బుడగ ( గ.న ) ; పుపుసగోళము ( గ.న ) ; వాయు గోళము
- 434 ::