పుట:Hello Doctor Final Book.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శస్త్రచికిత్స :

ఔషధములకు లొంగక ఆమ్లతిరోగమనము ఎక్కువగా ఉన్నవారు, ఔషధములను సహించని వారు జీర్ణాశయపు పైభాగమును అన్ననాళము చుట్టూ చుట్టబెట్టి నిలిపే శస్త్రచికిత్స (Nissan’s fundo plication) గుఱించి యోచించాలి. ఈ శస్త్రచికిత్సవలన వెంటనే ఫలితములు ఉన్నా, దీర్ఘకాలములో మింగుట కష్టమగుట, తేన్పులు కష్టమగుట, కడుపు ఉబ్బరము, మొదలైన అవాంఛిత ఫలితములు కలుగవచ్చును. మందులతో ఉపశమనము పొందేవారు శస్త్రచికిత్స జోలికి వెళ్ళకపోవుట మంచిది. ఉపద్రవములు : అన్నవాహికలో ఒరిపిడులు, వ్రణములు (Erosions, Ulcers):

ఇవి ఎక్కువగా అన్నవాహిక దిగువభాగములో జీర్ణాశయమునకు దగ్గఱలో కలుగుతాయి. అరుదుగా వీటివలన రక్తస్రావము, రక్తనష్టము, పాండురోగము కలుగగలవు. అంతర్దర్శినితో (Endoscopy) వీటిని వైద్యులు కనుగొనగలరు. అన్నవాహికలో ఇరకటములు / సంకోచములు ( strictures ) :

432 ::