పుట:Hello Doctor Final Book.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ton pump inhibitors) వాడి అంతర్దర్శినితో (endoscopy) పరీక్షించి సత్ఫలితములు రాని వారిలో స్థానికముగా పనిచేసే కార్టికోష్టీరాయిడులు ఫ్లుటికసోన్ (fluticasone), కాని బ్యుడినొసైడ్ (budenoside) కాని వాడవచ్చును. కొందఱిలో నోటిద్వారా ప్రెడ్నిసోన్ అవసరమవవచ్చును. అసహనములుగా ఋజువయిన  ఆహారపదార్థములు  మానివేయాలి. ఆక్రమణ వ్యాధులు ( Infectious diseases ) :

వ్యాధినిరోధకశక్తి తగ్గినవారిలోను ( హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్థులు, పర అవయవ దానములు (organ transplantation) కలవారు, కర్కణవ్రణ వ్యాధిగ్రస్థులు, మధుమేహవ్యాధిగ్రస్థులు), సూక్ష్మజీవ నాశకములు (antibiotics), కార్టికోష్టీరాయిడులు వాడేవారిలోను, స్క్లీరోడెర్మా (scleroderma), అన్ననాళపు క్రింది నియంత్రణకండరపు బిగింపు ( achalasia cardia ) వంటి అన్ననాళ కండరచలన దోషములు కలవారిలోను, మధుశిలీంధ్రములు (Candida), హెర్పీస్ సింప్లెక్స్ విషజీవాంశములు (HSV), సైటోమెగాలో వైరస్లు (Cytomegalovirus - CMV), అన్నవాహిక శ్లేష్మపు పొరను ఆక్రమించి అన్నవాహికలో తాపము కలిగించగలవు. వీరిలో మింగుడు కష్టమగుట (dysphagia), మింగునపుడు నొప్పి (odynophagia) వంటి లక్షణములు కనిపిస్తాయి. అంతర్దర్శినితో అన్ననాళమును పరీక్షించుటవలన, తునకలను తీసుకొని కణపరీక్షలు చేయుటవలన వ్యాధులను నిర్ధారించవచ్చును. ఆపై ఆ వ్యాధులకు చికిత్స చెయ్యాలి. రసాయనపదార్థములు కలిగించు అన్ననాళ తాపములు (Chemical Oesophagitis) :

తీవ్రక్షారములు, ఆమ్లములు మింగుటవలన, పొటాసియమ్, డాక్సీసైక్లిన్, క్వినిడిన్, ఏస్పిరిన్, తాపకహరములు (anti inflammatory agents) వంటి ఔషధములు మింగుటవలన అన్ననాళములో కణవిధ్వంసము, ఒరిపిడులు (erosions), తాపములు కలిగి మింగుట ఇబ్బంది కావచ్చును.

428 ::