పుట:Hello Doctor Final Book.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చలనములో ఇతర దోషములు కలవారిలోను అన్ననాళములోనికి మఱలే ఆమ్లము త్వరగా జీర్ణాశయములోనికి తిరిగి మళ్ళించబడదు. వీరిలో ఆమ్ల తిరోగమన వ్యాధి లక్షణములు ఎక్కువగా చూస్తాము. కాఫీ, టీ, చాకొలేట్లు, మద్యపానముల వలన, కొన్ని ఔషధముల {బైఫాస్ఫొనేట్లు (biphophonates) కాల్సియమ్ మార్గ అవరోధకములు (Calcium channel blockers), ట్రైసైక్లిక్ క్రుంగుదల నివారణ మందులు, బెంజోడయజిపామ్స్} వలన ఆమ్లతిరోగమన లక్షణములు కలుగవచ్చును. ఆమ్లతిరోగమన వ్యాధి లక్షణములు :

కడుపులో పదార్థములు నోటిలోనికి వచ్చుట, ఛాతిలో మంట తఱచు కలిగే లక్షణాలు. దగ్గు, గొంతునొప్పి, గొంతు బొంగురుపోవుట, ఆయాసము, ఛాతిలో పిల్లికూతలు, దంతములలో ఎనామిల్ నష్టము ఆమ్ల తిరోగమనము వలన కలిగే ఇతర లక్షణములు. కొందఱిలో గుండెనొప్పిలా ఈ వ్యాధి కనిపించవచ్చును. వారిలో హృద్ధమనివ్యాధులకు తొలిగా శోధించాలి. ఆమ్ల తిరోగమనమును పోలు ఇతర వ్యాధులు

ఆమ్ లా కర్ష ణ కణ అన్నవాహిక తాపము (Eosinophilic esophagitis) :

ఈ వ్యాధిలో అన్నవాహిక శ్లేష్మపు పొరలో ఆమ్లాకర్షణ కణములు కూడుకుంటాయి. ఈ వ్యాధిగ్రస్థులలో అసహన చర్మతాపము (atopy), అసహన నాసికా తాపము(allergic rhinitis), ఉబ్బస (Asthma) వంటి వ్యాధులు సామాన్యము. కొన్ని ఆహారపదార్థములకు అసహనము యీ వ్యాధికి కారణము కావచ్చును. వీరిలో మింగుటకు కష్టము (కష్ట కబళనము/ dysphagia), ఆహారపదార్థములు అన్ననాళములో ఇరుక్కుపోవుట (food impaction), ఛాతిలో మంట, వంటి లక్షణములు కలుగవచ్చు. అంతర్దర్శినితో పరీక్షించినపుడు అన్ననాళము కుచించుకుపోవుట, లోపొరలో బొఱియలు (furrows), పగుళ్ళు, కాలువల వంటి పల్లములు ( corrugations ), తెల్లని ఫలకలు ( plaques ) కనిపించ వచ్చును. చిన్న తునుక తీసుకొని కణపరీక్ష చేస్తే ఆమ్లాకర్షణ కణాలు (eosinophils) 15 / HPF మించి ఉంటాయి. రెండు నెలల ఆమ్లయంత్ర నిరోధక ఔషధములు (pro:: 427 ::